Begin typing your search above and press return to search.
జగన్ సర్కారుకు తలనొప్పిగా మారిన ఉద్యోగ సంఘాల అతిప్రేమ
By: Tupaki Desk | 25 Jan 2021 2:00 PM GMTప్రజాస్వామ్యంలో రెండు అత్యుత్తమ వ్యవస్థల మధ్య లొల్లి మొదలైనప్పుడు అయితే.. ఇరువురికి ధర్మాన్ని బోధించి.. తగ్గమని చెప్పాలి. లేదంటే.. అన్ని మూసేసుకొని కామ్ గా ఉంటే.. ఇష్యూలు దానంతట అవే క్లోజ్ అవుతాయి. అందుకు భిన్నంగా తాము బలపరుస్తున్న వ్యవస్థకు అండగా నిలిచే ప్రయత్నంలో అవసరమానికి మించిన అతి ప్రదర్శిస్తే ఏం జరుగుతుందన్నది ఏపీలో చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతాయి.
ఏపీ ప్రభుత్వం వర్సెస్ ఏపీ ఎన్నికల సంఘం మధ్య టర్మ్స్ సరిగా లేనప్పుడు.. ఏపీ ఉద్యోగులు మధ్యలో దూరాల్సిన అవసరం లేదు. కానీ.. ఆ విషయాన్ని మర్చిపోయిన ఏపీ ఎన్జీవోలు స్వామిభక్తిని ప్రదర్శించే క్రమంలో అవసరానికి మించిన విధేయతను ప్రదర్శించారు.
ఏపీలో పంచాయితీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును చూసినప్పుడు ఉద్యోగసంఘాల వారి తీరును ప్రత్యేకంగా ప్రస్తావించటం చూస్తే.. ప్రభుత్వ ఉద్యోగుల అతి మోతాదుకు మించి ఉండటం కూడా కారణంగా చెప్పాలి. ఏపీలో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి దాఖలైన కేసుల విచారణలో సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యల్ని ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.
ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోమని చెప్పిన అత్యుత్తమ న్యాయస్థానం కొన్ని అంశాల్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. 'రెండు వ్యవస్థల మధ్య ఉన్న వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జోక్యం మంచిది కాదు. రెండు వ్యవస్థల మధ్య ఉన్న వ్యవహారంతో మీకేం సంబంధం' అంటూ ఘాటుగా రియాక్టు కావటం చూస్తే.. ఏపీ ఉద్యొగుల సంఘం ప్రతినిధుల అతి ఎంత స్థాయిలో ఉందన్నది అర్థమవుతుంది.
నిజానికి ఏపీలో జరగాల్సిన పంచాయితీ ఎన్నికల విషయంలో ప్రభుత్వానికి.. దాని ఉద్యోగాల నైతిక మద్దతు ఉండాలే కానీ.. చొక్కాలు చించుకొని పార్టీ నేతల మాదిరి అస్సలు మాట్లాడకూడదు. కానీ.. ఈ సూక్ష్మాన్ని ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు సైతం మర్చిపోయారు. నిజానికి పంచాయితీ ఎన్నికల విషయంలో ఉద్యోగ సంఘాలు అస్సలు ప్రస్తావించకపోతే.. పరిస్థితి వేరేలా ఉండేదన్న మాట వినిపిస్తోంది.
ప్రభుత్వమే కావాలని ప్రభుత్వ ఉద్యోగుల్ని తనకు తగినట్లుగా మాట్లాడించుకుంటుందన్న భావన కలిగేలా ఉద్యోగ సంఘాలు వ్యవహరిచాయి. వాటి ఆగ్ర నేతల తీరు మరింత అభ్యంతరకరంగా మారింది. మీడియా ముందుకు వచ్చేసి మసాలా కలిపి మరి మాట్లాడి మాటల్ని విన్నప్పుడు ప్రభుత్వమే ఎన్నికల సంఘం మీదకు గొడవ పెట్టుకునేందుకే వారిని ప్రయోగించినందన్న భావన కలుగక మానదు.
ఈ తీరు కూడా కేసు విచారణ సమయంలోనూ.. తీర్పును ప్రకటించే వైనంపై ప్రభావాన్ని చూపిందని చెప్పాలి. రెండు వ్యవస్థలు ఢీ కొన్నప్పుడు.. వాటి తరఫున సంబంధం లేని వారు నిలుచోవటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. తెలిసి చేశారో.. తెలియక చేశారో కానీ.. ఏపీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెద్ద తప్పునే చేశారు.
ఇప్పుడు వారికి ఎదురుదెబ్బ తగలటమే కాదు.. తాము అత్యంత విధేయులమని చాలా చెప్పుకునే ప్రయత్నం కాస్తా ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బ తీసేలా మారింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఏపీ ఉద్యోగసంఘాల ప్రతినిధుల అతి.. జగన్ సర్కారుకు శాపంగా మారిందని చెప్పక తప్పదు.