Begin typing your search above and press return to search.

ఆ పెయింటింగ్ విలువ రూ.300 కోట్లు!

By:  Tupaki Desk   |   31 May 2021 1:30 AM GMT
ఆ పెయింటింగ్ విలువ రూ.300 కోట్లు!
X
చూడ్డానికి పై చిత్రం ఎలా ఉందీ..? సంక్రాంతి పోటీల్లో వేసిన ముగ్గులను.. పిల్లలు దుమ్ము దుమ్ముగా తొక్కేసినట్టు క‌నిపిస్తోంది క‌దూ? కానీ.. దీని చరిత్ర తెలుసుకున్నారంటే నోరెళ్ల బెడతారు. ఇదొక‌ పెయింటింగ్. దీని వాల్యూ ఎంతో తెలుసా? అక్ష‌రాలా రూ.300 కోట్ల రూపాయ‌లు! అంత డ‌బ్బా..? దీంట్లో అంత స్పెషాలిటీ ఏముందని అడుగుతున్నారా? అయితే చ‌ద‌వండి..

ఈ భారీ పెయింటింగ్ ను గీసింది బ్రిట‌న్ కు చెందిన ‘స‌చా జాఫ్రీ’. ఆయ‌న ఒక ప్ర‌ముఖ ఆర్టిస్ట్‌. క‌రోనా లాక్ డౌన్ ప్ర‌పంచంపై ఎంత‌గా ప్ర‌భావం చూపిందో అంద‌రికీ తెలిసిందే. పెద్ద‌లు అవ‌గాహ‌న‌తో ఏదోవిధంగా కాలం నెట్టుకొస్తున్నా.. పిల్ల‌లు మాత్రం మాన‌సికంగా చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇంట్లోనే ఎందుకు ఉండాలో? ఈ ప‌రిస్థితి ఎప్పుడు మారిపోతుందో? అనే ఆలోచ‌న‌ల‌తో గ‌డిపేస్తున్నారు.

దీంతో.. ఇదే త‌న పెయింటింగ్ కు వ‌స్తువుగా ఎంచుకున్నాడు జాఫ్రీ. వెంట‌నే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న చిన్నారుల‌కు ఓ మాట చెప్పాడు. ఈ క‌రోనా లాక్ డౌన్‌ ఇబ్బందుల‌తో మీరు మాన‌సికంగా ఎలా ఫీల‌వుతున్నారు? ఒంట‌రిగా ఉన్నామ‌ని భావిస్తున్నారా? అసలు మీ ఫీలింగ్ ఏంటో బొమ్మల రూపంలో మీ భావాలను పంపించాలని కోరాడు.

దీనికి ఎంతో మంది స్పందించారు. వాట‌న్నింటినీ సేక‌రించిన జాఫ్రీ.. వారి భావాల‌ను కాన్వాస్ పై పెట్టేందుకు సిద్ధ‌మ‌య్యాడు. అంద‌రి ఫీలింగ్స్ ను క‌లుపుకొని ఈ పెయింటింగ్ వేయ‌డానికి ఆయ‌న‌కు దాదాపు ఏడునెల‌ల స‌మ‌యం ప‌ట్టింది. ఇందుకోసం 6,300 లీట‌ర్ల పెయింట్ వినియోగించాడు. మొత్తం 70 కాన్వాస్ ల మీద చిత్రించిన ఈ పెయింటింగ్ ను ఒక్క‌టిగా క‌లిపి ఇలా ప్ర‌ద‌ర్శించాడు. ఈ పెయింటింగ్ మొత్తం 17 వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఉండ‌డం విశేషం.

దుబాయ్ లో వేసిన ఈ పెయింట్ ను ఇటీవ‌లే వేలం వేశారు. దీన్ని ఫ్రాన్స్ కు చెందిన ఆండ్రీ అబ్దున్ రూ.300 కోట్ల కొనుగోలు చేశాడు. ఇంత‌కీ ఈ పెయింట్ అర్థం ఏంటో తెలుసా..? ‘జర్నీ ఆఫ్ హ్యుమానిటీ’. అదన్నమాట పెయింటింగ్ స్టోరీ.