Begin typing your search above and press return to search.

మహమ్మారి నిర్దారణ టెస్ట్ ఎంత తక్కువ కంటే ... కేవలం గంటకే రిజల్ట్

By:  Tupaki Desk   |   14 May 2020 10:10 AM GMT
మహమ్మారి నిర్దారణ టెస్ట్ ఎంత తక్కువ కంటే ... కేవలం గంటకే రిజల్ట్
X
దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి కేసులు రోజురోజుకీ వేగంగా పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా కేసులు ఆగడం లేదు. కరోనా బాధితులను గుర్తించడానికి నిర్వహించే పరీక్షలకు ఆలస్యం అవుతోంది. కరోనా పరీక్షలకు సంబంధించి ఫలితాలు వచ్చేందుకు ఎక్కువ సమయం తీసుకోవడంతో కేసుల సంఖ్య కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కరోనా కేసులను గుర్తించి వ్యాప్తిని అరికట్టడంలో అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కానీ, కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేయలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా టెస్టులకు అయ్యే ఖర్చు కూడా భారీగా ఉండటం తో అందరికి కరోనా పరీక్షలు నిర్వహించాలంటే కష్టంతో కూడుకున్న పని. కరోనా టెస్టుల ఫలితాలు మరింత జాప్యమవుతోంది.

అయితే ,చౌకైన ధరకే కరోనా టెస్టు కిట్లు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు.. కేవలం గంట వ్యవధిలోనే కచ్చితమైన ఫలితం రాబోతుంది . దేశంలో మరో నాలుగు వారాల్లో ఈ కరోనా టెస్టు కిట్లు అందుబాటులోకి రానున్నాయి. ఫెలూదా అనే ఈ టెస్టింగ్ పాలసీలో ఈ మహమ్మారిని నిర్ధారించేందుకు సుమారు రూ.500 ఖర్చు అయ్యే అవకాశం ఉంది. దీన్ని ఢిల్లీలోని కౌన్పిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (CSIR-IGRB) లో సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ దేబొజ్యోతి చక్రవర్తి, డాక్టర్ సౌవిక్ మైతీ ఈ టెస్టు కిట్లను కనిపెట్టారు.

మార్కెట్లో అందుబాటులోకి తెచ్చేందుకు టాటా సన్స్ సంస్థకు అనుమతి లభించింది. ఈ వైరస్ పరీక్షా విధానం పూర్తి పేరు - FNCAS9 ఎడిటర్ లింక్డ్ యూనిఫార్మ్ డిటెక్షన్ అస్సే... సింపుల్‌గా ‘ఫెలూదా’ అని పిలుస్తున్నారు.ప్రముఖ భారతీయ దర్శకుడు సత్యజిత్ రే సృష్టించిన కల్పిత డిటెక్టివ్ పాత్ర పేరు ఫెలూదా. వైరస్ నిర్ధారణకు ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న విధానాల్లో ల్యాబరేటరీ తప్పనిసరి. కేవలం ఓ పేపర్ స్ట్రిప్‌ను ఉపయోగించే ఫెలూదా విధానంలో ల్యాబ్ అవసరం ఉండదు.