Begin typing your search above and press return to search.
ఆ దేశంలో మారిన పాస్ పోర్ట్ రూల్స్.. జర సోచో..!
By: Tupaki Desk | 24 Nov 2022 3:30 PM GMTవిదేశాలకు వెళ్లాలంటే పాస్ట్ పోర్ట్ తప్పనిసరి ఉండాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా మెజార్టీ దేశాలు పాస్ పోర్ట్ నిబంధనలను పాటిస్తున్నాయి. అయితే ఆయా దేశాల్లోని పరిస్థితులను బట్టి ఒక్కో దేశంలో ఒక్కో విధంగా రూల్స్ ఉంటున్నాయి. దీంతో విదేశాలకు వెళ్లే వాళ్ళు తప్పనిసరిగా ఆ రూల్స్ గురించి తెలుసుకోవాల్సిందే.. లేనట్లయితే ఎయిర్ పోర్టుకు వెళ్లాక తెల్లముఖం వేసుకొని తిరుగుముఖం పట్టాల్సి రావచ్చు.
విదేశాలకు వెళ్లే వారు తరుచూ ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే వీసా.. పాస్ పోర్ట్ జారీల విషయంలో వస్తున్న మార్పులను ఎవరైతే ముందుగా తెలుసుకొని అప్రమత్తంగా ఉంటారో వారికి విదేశాలకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బదులు ఉండవని చెప్పొచ్చు. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్ (UAE) తమ దేశ పాస్ పోర్ట్ విషయంలో కీలక మార్పులు చేసింది.
యూఏఈ అధికారుల తెలిపిన వివరాల మేరకు.. ఇంతకు ముదు పాస్ పోర్టుపై పూర్తి పేరు లేకుండా ఒకే పదం ఉన్న తమ దేశంలోకి అనుమతించామని తెలిపారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో మార్పులు చేసినట్లు వెల్లడించారు. ఇకపై టూరిస్ట్.. ఇతర వీసాదారుల పాస్ట్ పోర్టుపై పూర్తి పేరు లేకుండా ఒకే పదం ఉంటే వారిని తమ దేశంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.
ఈ కొత్త నిబంధనలు విజిట్ వీసా.. వీసా ఆన్ అరైవల్.. ఉపాధి వీసా.. తాత్కాలిక వీసాదారులకు వర్తిస్తుందని పేర్కొన్నారు. అయితే యూఏఈలో శాశ్వత నివాస హోదా ఉన్న వారికి ఈ నిబంధనలు వర్తించవని అరబ్ దేశ ఇమ్మిగ్రేషన్ విభాగ అధికారులు తెలిపారు. ఈ మేరకు భారత్ సహా పలు దేశాల ఎయిర్ లైన్స్ సంస్థలు తమ వినియోగదారులకు పలు సూచనలు చేస్తున్నాయి.
పాస్ పోర్టులో పూర్తి పేరు లేకుండా ఎవరైతే ఉంటారో వారంతా 'ఫస్ట్ నేమ్' లేదా 'సర్ నేమ్' కాలమ్ ను అప్డేట్ చేసుకోవాలని భారత ఎయిర్ లైన్స్ సంస్థ ప్రయాణికులను అలర్ట్ చేస్తుంది. అయితే దీనిపై యూఏఈ రాయబార కార్యాలయం నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడం గమనార్హం. ఏది ఏమైనా పాస్ట్ పోర్టు విషయంలో ఒక్కో దేశం ఒక్కో రూల్ ను పాటిస్తుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.