Begin typing your search above and press return to search.

గే జంట పెళ్లి ప్రజల ఆగ్రహం.. ఏం చేశారంటే?

By:  Tupaki Desk   |   9 Oct 2020 3:00 PM GMT
గే జంట పెళ్లి ప్రజల ఆగ్రహం.. ఏం చేశారంటే?
X
అమెరికాలో ఓ గే జంట పెళ్లిపై కర్ణాటకలోని కొడగు జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కర్ణాటకలోని కొడవ సామాజికవర్గానికి చెందిన శరత్ పొన్నప్ప, కాలిఫోర్నియాలో డాక్టర్ గా పనిచేస్తున్న సందీప్ దోసాంజిని సెప్టెంబర్ 26న పెళ్లి చేసుకున్నాడు. కొందరు మిత్రుల సమక్షంలో కొండవ సంప్రదాయంలో ఈ ఇద్దరు మగవాళ్లు పెళ్లి చేసుకోవడం కలకలం రేపింది.

కొడవ వేషధారణలో ఉన్న పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరు మగాళ్లు(గే జంట) ఇలా పెళ్లి చేసుకోవడంతో కర్ణాటకకు చెందిన శరత్ పై అక్కడి వారు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అనాదిగా వస్తున్న మా ఆచారాలను మంట గలిపావ్ అంటూ శరత్ పై మండిపడ్డారు. ఈ పెళ్లిని ఖండిస్తున్నామని మడికెరి కొడవ సమాజ ప్రెసిడెంట్ దేవయ్య స్పష్టం చేశారు. తమ కులానికి శరత్ మచ్చ తెచ్చాడని మండిపడ్డారు.

ఇక శరత్ ను తమ కులం నుంచి వెలివేస్తున్నామని అన్నారు. గతంలో ఇలాంటి ఎప్పుడూ చూడలేదని ప్రజలు అన్నారు. వారి పెళ్లితో తమకు సంబంధం లేదని.. కొడవ వేషధారణలో పెళ్లి చేసుకోవడం కలిచివేసిందని కులస్థులు అన్నారు. తమ సంప్రదాయాలను మంటగలిపారని.. మా కులంలో చెడబుట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా ఈ విషయంపై స్పందించేందుకు దుబాయ్ లో ఉన్న శరత్ తల్లిదండ్రులు నిరాకరించారు. కొడగు జిల్లా కాఫీ తోటలకు ఫేమస్. కొడవ కులస్థులు ఎక్కువగా కొడగు జిల్లాలోనే ఉంటారు. కొండలు, గుట్టలు, పర్వతాలు నదులతో కొండ ప్రాంతంగా ఉండే ఇక్కడే ఈ కులస్థులు జీవిస్తారు.