Begin typing your search above and press return to search.
'తెలంగాణ ప్రజలు తెలివి ఉన్నవాళ్లు.. మీ కుట్రలు కుతంత్రాలు తిప్పి కొడతారు'
By: Tupaki Desk | 10 April 2021 7:41 AM GMTమాజీ ముఖ్యమంత్రి కూతురు , ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి కి స్వయానా సోదరి అయినటువంటి షర్మిల తెలంగాణ లో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ పార్టీ ఏర్పాటు , విస్తరణ పై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఖమ్మం సంకల్ప యాత్ర సభలో శుక్రవారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై తీవ్రైన విమర్శలు చేశారు. తెలంగాణలో గడీల పాలన నుండి ప్రజలని విముక్తుల్ని చేసి , రాజన్న రాజ్యం స్థాపించడానికి నేను రాజకీయాల్లోకి వచ్చా అంటూ షర్మిల తీవ్రమైన స్వరం తో మాట్లాడారు.
షర్మిల మాటలకి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. . గడీల పాలన తెలంగాణలో లేదని, పులివెందులలో ఉందని ఆయన అన్నారు. ఆంధ్రపాలనలో తెలంగాణ దోపిడీకి గురైందని, ఇంకా దుర్బుధితో కొత్త పార్టీలు వస్తున్నాయని ఆయన షర్మిల పార్టీ ఏర్పాటు నిర్ణయంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ అని, వివిధ వ్యవసాయ పథకాల అవసరాల కోసం 15 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని , అందుకే దేశంలో తెలంగాణ రాష్ట్రమే అభివృద్ధిలో ముందు ఉందని స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు, సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా నీటి దోపిడీ చేసింది ఎవరు ? అని షర్మిలను నిలదీశారు. మళ్లీ తెలంగాణ ప్రజల మధ్య బేధాభిప్రాయాలు, అలజడి సృష్టించాలనే మీ పన్నాగాలు ఇక పారవని, తెలంగాణ ప్రజలు తెలివి ఉన్నవాళ్లని.. మీ కుట్రలు కుతంత్రాలు తిప్పి కొడతారని హెచ్చరించారు. మతాలు, ప్రాంతాలు, కులాల పేరుతో చిచ్చు పెట్టే వారికి బుద్ది చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ అని, పెయింటింగ్ పని చేసుకునే వాడు ఈరోజు రేంజ్ రోవర్ కారులో తిరుగుతున్నాడని నిప్పులు చెరిగారు. నల్లగొండ జిల్లా ప్రజలకు గుత్తా గురించి బాగా తెలుసని, నాకు మీ సర్టిఫికెట్ అవసరం లేదు అని రేవంత్ రెడ్డి పై విమర్శలు చేశారు.