Begin typing your search above and press return to search.
పోలవరంపై కేంద్రం మళ్లీ మెలిక.. ప్రాజెక్టు పూర్తి మరింత కష్టమే!
By: Tupaki Desk | 25 March 2022 9:23 AM GMTరాష్ట్ర ప్రభుత్వం.. ప్రజలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభు త్వం మరోసారి.. తన బుద్ధిని ప్రదర్శించింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మరో మెలిక పెట్టింది. సామాజిక, ఆర్థిక సర్వే మరోసారి నిర్వహించాలంటూ షరతులు విధించింది. డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్పై డీపీఆర్ తయారు చేయాల్సిందేనని నిబంధన తీసుకొచ్చింది. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారో గడువు చెప్పాలని కేంద్ర జలశక్తి శాఖ కోరింది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రూ. 15 వేల 668 కోట్ల వరకే తమ బాధ్యతని స్పష్టం చేసింది.
2022 ఫిబ్రవరి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేల 336 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని... అందులో రూ.12వేల 311 కోట్లు కేంద్రం తిరిగి చెల్లించినట్లు తెలిపింది. ఇంకో రూ.437 కోట్ల బిల్లుల్ని పోలవరం అథారిటీ పంపినట్లు వివరించింది. ఈ మేరకు తాజాగా లోక్సభలో వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేస్వర్ తుడు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
దీనిలో చాలా ఆశ్చర్యకరమైన అంశాలు ఉండడం గమనార్హం. నిజానికి ఇప్పటి వరకు లేవనెత్తని అనేక అంశాలను ఈ దఫా.. ప్రస్తావించడం విశేషం.
ఇప్పటికే ఒకసారి పూర్తయిన సామాజిక, ఆర్థిక సర్వేను తాజాగా మరోసారి నిర్వహించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం షరతులు విధించింది. పోలవరం నిర్మాణంపై లోకసభలో వైసీపీ ఎంపీలు బ్రహ్మానంద రెడ్డి, సత్యవతి, రెడ్డప్పలు అడిగిన ప్రశ్నలకు కేంద్రం ఇలా సమాధానం ఇవ్వడం గమనార్హం. డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ పైన డీపీఆర్ తయారు చేయాల్సిందే అని కేంద్రం మరో నిబంధన పెట్టింది. వాస్తవానికి ఇప్పటికే అనేక డీపీఆర్‌లను ప్రభుత్వం ఇచ్చింది.అయితే.. మరోసారి ఇలా కోరడం అంటే.. ప్రాజెక్టును మరింత ఆలస్యం చేయడమేనని అంటున్నారు.
అదేవిధంగా ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో గడువు షెడ్యూల్ చెప్పాలని కేంద్ర జలశక్తి శాఖ కోరింది. పోలవరం నిర్మాణంలో ప్రస్తుతానికి రూ.15668 కోట్ల వరకే తమ బాధ్యత అని కేంద్రం మరోసారి తేల్చిచెప్పింది. వాస్తవానికి ప్రభుత్వం 57 వేల కోట్ల రూపాయలుగా నిర్ణయించాలని కోరుతోంది.. కానీ, కేంద్రం ఎప్పటికప్పుడు.. మెలిక పెడుతోంది. కొన్నాళ్ల కిందట 14 వేల కోట్లకే పరిమితమని పేర్కొంది. తాజాగా ఇప్పుడు.. మరో వెయ్యి కోట్లు పెంచి 15 వేల కోట్లుగా నిర్ణయించింది.
ఇక, ఇప్పటికే.. ఫిబ్రవరి 2022 వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ. 14336 కోట్లు మాత్రమే అని... దీనిలో రూ. 12311 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తిరిగి చెల్లించిందని వెల్లడించింది. అలాగే రూ. 437 కోట్లకు పోలవరం ఆధారిటీ బిల్లులు పంపిందని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది. కేంద్రం కొత్త నిబంధనలతో పోలవరం నిర్మాణం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దీనిపై సీఎం జగన్ ఎలారియాక్ట్ అవుతారో చూడాలి.