Begin typing your search above and press return to search.

ద‌ర్శిలో నువ్వా-నేనా.. వైసీపీ ర‌గ‌డ‌

By:  Tupaki Desk   |   28 Nov 2020 2:30 AM GMT
ద‌ర్శిలో నువ్వా-నేనా.. వైసీపీ ర‌గ‌డ‌
X
ప్ర‌కాశం జిల్లా ద‌ర్శినియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నేత‌ల రాజ‌కీయాలు రోడ్డున ప‌డ్డాయి. నాయ‌కులు నువ్వా-నేనా అంటూ.. ఒక‌రిపై ఒక‌రు ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు తెర‌దీశారు. దీనికి కార‌ణ‌మేంటి? అస‌లు నియోజ‌క‌వ‌ర్గంలో ఏం జ‌రుగుతోంది? అనే ప్ర‌శ్న‌లు అంద‌రిలోనూ ఆస‌క్తిగా మారాయి. విష‌యంలోకి వెళ్తే.. 1955 నుంచి జ‌రిగిన ఎన్నిక‌ల‌ను గ‌మ‌నిస్తే.. ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీ దూకుడు ఎక్కువ‌గా ఉంది. ఏడు సార్లు కాంగ్రెస్ ఇక్క‌డ విజ‌యం సాధించింది. రెండు సార్లు టీడీపీ గెలుపు గుర్రం ఎక్క‌గా.. గ‌త ఏడాది వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. కాంగ్రెస్ త‌ర‌ఫున చివ‌రిసారిగా 2004, 2009లో బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డి విజ‌యం సాధించారు.

2014లో ఆయ‌న వైసీపీ త‌ర‌ఫున పోటీ చేశారు. అయితే, ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ అనూహ్య విజ‌యం సాధించిం ది. శిద్దా రాఘ‌వ‌రావు.. విజ‌యం ద‌క్కించుకుని కేబినెట్ మంత్రి అయ్యారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లోనూ ఆయ ‌నే ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని అనుకున్నా.. చివ‌రి నిముషంలో ఒంగోలు పార్ల‌మెంటు నుంచి పోటీ చేయాల్సి వ‌చ్చింది. దీంతో బ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన క‌దిరి బాబూరావుకు అవ‌కాశం ఇచ్చారు. అయితే.. ఆయ‌న ఓడిపోయారు. త‌ర్వాత ఇక్క‌డ నుంచి ఆయ‌న వేరే చోట‌కి మారిపోయారు. దీంతో టీడీపీకి ఇక్క‌డ ప్రాతినిధ్యం వ‌హించేవారు లేరు. ఇక‌, శిద్దా కూడా వైసీపీలోకి చేరిపోవ‌డం ఇప్పుడు ఎటు చూసినా.. వైసీపీ జెండాలే క‌నిపిస్తున్నాయి.

ఈ క్ర‌మంలో గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ హ‌వా బాగుంది. ఇక్క‌డ ఓ విష‌యం చెప్పుకోవాలి. 2014లో ఓడిపోయిన‌ బూచేప‌ల్లి.. అప్ప‌టి టీడీపీ దూకుడు, మంత్రి శిద్దా రాఘ‌వ‌రావు వ్యూహంతో వైసీపీ కేడ‌ర్ టీడీపీలోకి చేరిపోవ‌డంతో చేతులు ఎత్తేశారు. తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోంటున్నాన‌ని ప్ర‌క‌టించి.. జెండా విసిరేశారు. జ‌గ‌న్ బ్ర‌తిమ‌లాడినా.. ఆయ‌న ప‌ట్టించుకోలేదు. ఈ క్ర‌మంలోనేఇద్ద‌రు ఇంచార్జ్‌ల‌ను మార్చి చివ‌రికి వేణుకు అవ‌కాశం ఇచ్చారు ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కారు. పార్టీ గాడిన ప‌డింది. దీంతో ఇప్పుడు బూచేప‌ల్లి మ‌ళ్లీ త‌న నియోజ‌క‌వ‌ర్గం త‌న‌కే ఇవ్వాల‌ని ర‌గ‌డ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఎమ్మెల్యే వేణుకు వ్య‌తిరేకంగా క‌ర‌ప‌త్రాలు పంచ‌డం, లోపాయికారీగా.. ద్వితీయ శ్రేణి నేత‌ల‌ను రెచ్చ‌గొట్టి వేణుకు వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్ప‌డం వంటివి చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ విష‌యం వివాదంగా మారింది. వేణుకూడా అంతే గ‌ట్టిగా ప‌ట్టుప‌డుతున్నారు. తాను వైసీపీని నిల‌బెట్టాన‌ని.. తానే వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ నుంచి పోటీకి దిగుతాన‌ని.. అధిష్టానం త‌న‌ను అర్ధం చేసుకోవాల‌ని కోరుతున్నారు. అయితే.. బూచేప‌ల్లికి బ‌ల‌మైన వైసీపీ నేత‌లు అండ‌గా ఉన్నారు. మ‌ద్దిశెట్టి రెడ్డి సామాజిక వ‌ర్గం కాక‌పోవ‌డంతో బూచేప‌ల్లి వైపు అంద‌రూ మొగ్గు చూపుతున్నారు. దీంతో చిన్న వివాదం పెద్ద ర‌గ‌డ‌కు దారితీస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కుల‌. ప్ర‌స్తుతం ఇది జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు చేరింది. ఎలాంటి తీర్పు చెబుతారో చూడాలి.