Begin typing your search above and press return to search.

ముస్లింలు ఎక్కువ ఉన్న చోట ఎక్కువ పోలింగ్ శాతం!

By:  Tupaki Desk   |   16 May 2019 6:26 AM GMT
ముస్లింలు ఎక్కువ ఉన్న చోట ఎక్కువ పోలింగ్ శాతం!
X
దేశ రాజధాని ఢిల్లీ వ్యాప్తంగా ఈసారి లోక్‌ సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం సుమారు 61 శాతం నమోదు అయింది. అయితే గత 2014 (66 శాతం) కంటే ఈసారి కొంచెం తగ్గిందని చెప్పవచ్చు. కానీ ముస్లిం ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం పెరిగింది. ఈ క్రమంలో ముస్లిం ఓట్లు ఆప్‌ లేదా కాంగ్రెస్‌ కే వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆయా స్థానాల్లో బీజేపీకి దెబ్బ పడినట్లు అంచనా వేస్తున్నారు. అయితే ముస్లిం ఓటర్లు జాతీయ పార్టీ వైపు ఉన్నారని కాంగ్రెస్‌ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు ఢిల్లీలోని ఏడు పార్లమెంటు స్థానాలకు గానూ మూడు ఎంపీ స్థానాల్లో ముస్లిం ఓటర్ల ప్రాబల్యం అధికంగా ఉంది.

ఫలితంగా చాందినిచౌక్, ఈశాన్య ఢిల్లీ, పూర్వ ఢిల్లీపై బీజేపీ ఆశలు వదులుకోవాల్సిందేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే గత 2014 ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌ స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం బీజేపీ నాలుగు సీట్లపై నిఘా ఉంచగా.. కాంగ్రెస్‌ – ఆప్‌ మూడు స్థానాల్లో గెలుపుపై ఆశలు పెట్టుకున్నాయి. ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి ఉత్తమ కార్యక్రమాలు చేపట్టారనే మంచి పేరు ఉండటంతో ఆప్‌ ఈసారి ఢిల్లీలో ఖాతా తెరుస్తుందని భావిస్తున్నారు. అయితే గతంలో పాగా వేసిన కాంగ్రెస్‌కు మళ్లీ కష్టకాలం ఎదురు కానుందని చెబుతున్నారు. కానీ కేవలం ముస్లిం ఓట్ల ప్రాంతాలపై మాత్రమే కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

విజయావకాశాలు
– ముస్లిం ఓటర్ల ప్రాంతంలో కాంగ్రెస్‌ లేదా ఆప్‌ కు ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది.
– అంతేకాకుండా ప్రజలు జాతీయ పార్టీకే ఓట్లు వేశారని కాంగ్రెస్‌ భావిస్తోంది.
– ఓటర్లు, అభ్యర్థుల మధ్య విశ్వాసం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఓటింగ్‌ శాతం గత 2014 కంటే ఈసారి తగ్గింది.

ఢిల్లీలో 2019 ఎన్నికల్లో పోలింగ్‌ నమోదు శాతం
ఈశాన్య ఢిల్లీ – 63.45
చాందినిచౌక్‌ – 62.63
తూర్పు ఢిల్లీ – 61.93
పశ్చిమ ఢిల్లీ – 60.64
వాయువ్య ఢిల్లీ – 58.72
దక్షిణ ఢిల్లీ – 58.13
న్యూఢిల్లీ – 56.91 శాతం పోలింగ్‌ నమోదు అయింది.

ఢిల్లీలో ముస్లిం ఓటర్ల ప్రభావం ఎక్కడ అంటే..
1) చాందినీచౌక్‌2) ఈశాన్య ఢిల్లీ 3) తూర్పు ఢిల్లీ