Begin typing your search above and press return to search.

రేషన్‌ కోసం బెంజి కారులో వచ్చిన ‘పేదవాడు’.. వీడియో వైరల్

By:  Tupaki Desk   |   7 Sep 2022 12:30 AM GMT
రేషన్‌ కోసం బెంజి కారులో వచ్చిన ‘పేదవాడు’.. వీడియో వైరల్
X
సాధారణంగా రేషన్ బియ్యం ఎవరు తింటారు.. పేదలు, మధ్యతరగతి వారు. కానీ రేషన్ కార్డును మాత్రం ఎవరూ వదులుకోరు.. అందుకే ఎంత ఆస్తి పరులైనా క్యూలో నిలబెడి రేషన్ కార్డు తీసుకుంటారు. అయితే కార్లు ఉన్న వారు కూడా రేషన్ లబ్ధిదారులుగా ఉంటున్న పరిస్థితి. అలా అని రేషన్ కోసం కారు ఎవరూ వేసుకొని రారు. అలా చేస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది.

కానీ పంజాబ్ లో ఓ వ్యక్తి ఏకంగా బెంజ్ కారులో వచ్చి రేషన్ కార్డు తీసుకెళ్లాడు. ఈ వీడియో వైరల్ కావడంతో అందరూ ఇలా రేషన్ వృథా అవుతోందంటూ మండిపడుతున్నారు. రేషన్ పంపిణీలో అవకతవకలు మరోసారి బయటకొస్తున్నాయంటున్నారు.

ఓ వ్యక్తి రేషన్ దుకాణంలో సరుకులు తీసుకునేందుకు ఏకంగా బెంజి కారులో వచ్చిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. పంజాబ్ లోని హోషియార్పూర్ లో జరిగిందీ ఘటన..

హోషియార్ పూర్ లోని ఓ ప్రభుత్వ రేషన్ దుకాణం ముందు ఓ లగ్జరీ మెర్సిడెస్ బెంజ్ కారు వచ్చి ఆగింది. అందులోంచి ఓ వ్యక్తి దిగి నేరుగా రేషన్ దుకాణంలోకి వెళ్లాడు. తన బీపీఎల్ కార్డు చూపించి సరుకులు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ సంచులను కారు డిక్కీలో పెట్టించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ వ్యక్తి రేషన్ దుకాణం నుంచి కారులో సరుకులు తీసుకెళ్తోన్న వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా తీవ్ర దుమారం రేపింది.

సదురు రేషన్ దుకాణాన్ని అమిత్ కుమార్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో స్థానిక మీడియా విలేకరులు అమిత్ ను ప్రశ్నించారు. అయితే ఆ వ్యక్తికి బీపీఎల్ కార్డు ఉందని.. తాను కేవలం ఆ కార్డును పరిశీలించిన తర్వాతే రేషన్ ఇచ్చానని తెలిపారు. అతడు కారులో వచ్చిన విషయం తనకు తెలియదని వివరణ ఇచ్చాడు.

వీడియో వైరల్ కావడంతో ఆ బెంజి కారులో వచ్చిన వ్యక్తి స్పందించాడు. ఆ కారు తమ బంధువులదని.. వారు విదేశాలకు వెళ్లడంతో కారును తమ ఇంటి ముందు పార్క్ చేసి వెళ్లారని... అప్పుడప్పుడు ఆ కారును తాను ఉపయోగిస్తానని తెలిపాడు.తాను పేద వ్యక్తినే అని.. డబ్బుల్లేక తమ పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలకే పంపిస్తున్నట్టు చెప్పడం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.