Begin typing your search above and press return to search.

గెలుపుపై జానారెడ్డి ధీమా.. ఈజీగా గెలుస్తాడట..?

By:  Tupaki Desk   |   12 Feb 2021 10:00 PM IST
గెలుపుపై జానారెడ్డి ధీమా.. ఈజీగా గెలుస్తాడట..?
X
పెద్దలు, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మరోసారి తనదైన శైలిలో మాట్లాడారు. తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు రంగం సిద్ధం అవుతున్న వేళ ఆ స్థానం నుంచి కాంగ్రెస్ తరుఫున పోటీచేస్తున్న జానారెడ్డి బయటకొచ్చి మాట్లాడారు.సాగర్ ఉప ఎన్నికల్లో తాను పోటీచేస్తానని జానారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం సైతం ఇదే ఆదేశించిందని జానారెడ్డి తెలిపారు. తనకు పదవులపై ఆశలేదని, అధిష్టానం ఆదేశాల మేరకు పోటీకి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.ఇక మరో హాట్ కామెంట్ ను జానారెడ్డి చేశారు. తనకు ఎమ్మెల్యే పదవి అనేది చాలా చిన్నదని, అయినా పోటీకి దిగుతానన్నారు. తెలంగాణలో ఎక్కువసార్లు గెలిచింది తానేనని జానారెడ్డి తెలిపారు.

రెండు సార్లు తెలంగాణలో గెలిచిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని జానారెడ్డి ఆడిపోసుకున్నారు. తెలంగాణను ప్రకటించడంలో కాంగ్రెస్‌ పాత్ర చాలా ఉందని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకొచ్చిన పరిశ్రమలే ఇప్పుడు తెలంగాణాకు రాబడిని తీసుకొస్తున్నాయన్నారు. ఆరోగ్యశ్రీ, ఉపాధి హామీ, రూపాయికి కిలో బియ్యం వంటి అనేక పథకాలను కాంగ్రెస్‌ పార్టీ తీసుకొచ్చిందని గుర్తుచేశారు. తనను ప్రజలు గెలిపిస్తారని.. తాను చేసిన సేవతోనే ఈజీగా గెలుస్తానని జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.