Begin typing your search above and press return to search.
ముగిసిన మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం.. 3న ఓటింగ్.. 6న కౌంటింగ్
By: Tupaki Desk | 1 Nov 2022 1:35 PM GMTతెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. మంగళవారం సాయంత్ర 6 గంటల సమయంలో మైకులన్నీ మూగబోయాయి. ప్రచారం ముగిసి ఇక ప్రలోభాలకు వేళైంది. ఎన్నికల ప్రచార వాహనాలన్నీ నిలిచిపోయాయి. ఎల్లుండి ఉప ఎన్నిక జరుగనుంది. ఈనెల 6వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ జరుగనుంది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.
ఇక ప్రచారం ముగియడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మునుగోడును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పరిధిలోని అన్ని లాడ్జీలు, హోటల్స్ ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బయటి వ్యక్తులను ఖాళీ చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభానికి గురిచేయకుండా చర్యలు తీసుకుంటున్నారు.
బరిలో మొత్తం 47మంది అభ్యర్థులు నిలిచారు. మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు పకడ్బందీ భద్రత కల్పించారు.
నవంబర్ 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ క్రమంలో ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్న అధికారులు, నేటితో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడుతుందని స్పష్టం చేశారు. ఈరోజు సాయంత్రం నియోజకవర్గంలో ప్రచారాన్ని ఆపివేయాలని.. సోషల్ మీడియాలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రచారం చేయవద్దని సూచిస్తున్నారు. సాయంత్రం తర్వాత నియోజకవర్గంలో బయట వ్యక్తులు ఎవరూ ఉండకూడదు అని స్పష్టం చేశారు.
మునుగోడు పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. మొత్తం 1192 మంది సిబ్బంది అవసరం ఉండగా.. అదనంగా 300 మందిని నియమించారు.
రాజకీయ పార్టీలను మాత్రమే కాక.. రాష్ట్ర ప్రజలు, దేశవ్యాప్తంగా ఈ ఉప ఎన్నిక ఉత్కంఠరేపింది. ఉత్కంఠ రేకెత్తిస్తోంది. నెలరోజులుగా సాగుతున్న మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి నేటితో తెరపడింది. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక జరుగనుంది. ఈ క్రమంలోనే మునుగోడులో గెలిచేదెవరు? మునుగోడులో పట్టు సాధించేది ఎవరు? మనుగోడుపై జెండా ఎగురవేసేది ఎవరు అన్నది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.
ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఎన్నికల పోరు పతాకస్తాయికి చేరింది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు పోటాపోటీగా ప్రచారాన్ని ప్రారంభించారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలోనే ఓటర్లను ప్రలోభపెట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించారు. దసరా, దీపావళి పండుగను ఎంతో ప్రత్యేకంగా నిర్వహించారు. ప్రతీ పండుగకు మునుగోడు ఓటర్లకు తోఫా ఇచ్చి వారిని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. విందులు, వినోదాలు, మందు పార్టీలతో హోరెత్తించారు. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. మునుగోడులో మూడు పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. ఈరోజుతో ప్రచారానికి తెరపడింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.