Begin typing your search above and press return to search.
మా పార్టీలో చేరండి.. మోడీకి ఆ దేశ ప్రధాని సరదా ఆఫర్
By: Tupaki Desk | 3 Nov 2021 8:30 AM GMTకమలనాథులు.. ప్రత్యేకించి మోడీ భక్తులు పండుగ చేసుకునే వార్తగా దీన్ని చెప్పాలి. ఈ వార్త చదివిన తర్వాత సంతోషంతో మోడీ భక్తులు ఈ రోజు భోజనం మానేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి.ఈ వార్తలో అంత విషయం ఉంది మరి. దేశంలో మోడీ పాపులార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడాది క్రితం లీటరు పెట్రోల్ రూ.70 ప్లస్ ఉండి.. తాజాగా రూ.110 ప్లస్ అయినప్పటికి వ్యతిరేకించకుండా ఉండటమే కాదు.. మోడీని తప్పు పట్టే వారిని తిట్టిపోసే ఫ్యాన్ ఫాలోయింగ్ మోడీ సొంతం.
మోడీ పాలనలో తీసుకున్ నిర్ణయాల్ని విమర్శించటమంటే దేశద్రోహానికి పాల్పడినట్లుగా కమలనాథులు తరచూ అభివర్ణిస్తుంటారు. ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మోడీకి.. భారత్ లో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లోనూ ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. తాజాగా స్కాట్లాండ్ లో జరుగుతున్న కాప్ 26 సదస్సుకు హాజరైన సందర్భంగా.. ఇప్పటివరకు ఎప్పుడూ ఎదురుకాని సరికొత్త అనుభవం మోడీకి ఎదురైంది.
ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ తో సమావేశమైన సందర్భంగా ఇరువురు అధినేతల మధ్య ఆసక్తికర చర్చ ఒకటి జరిగింది. ‘ఇజ్రాయెల్ లో అత్యంత పాపులర్ వ్యక్తి మీరే.. వచ్చి మా పార్టీలో చేరండి’ అంటూ ఆ దేశ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ సరదాగా వ్యాఖ్యానించటం ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోడీ ఇమేజ్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పే ఈ ఉదంతాన్ని ఇజ్రాయెల్ కు చెందిన పాత్రికేయుడు ఒకరు తన ట్విటర్ఖాతాలో పేర్కొన్నారు. దీంతో.. ఈ సరదా సంభాషణ వైరల్ గా మారటమే కాదు..అందరిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇక.. మోడీ భక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేని పరిస్థితి. ఇజ్రాయెల్ ప్రధాని చేసిన వ్యాఖ్యకు స్పందనగా ప్రధాని మోడీ గట్టిగా నవ్వుతూ ఆ అభినందల్ని స్వీకరించినట్లు చెబుతున్నారు. ఏమైనా.. ఇలాంటి ఇమేజ్ ను సొంతం చేసుకోవటం మోడీకి మాత్రమే సాధ్యమవుతుందేమో?