Begin typing your search above and press return to search.

బహుమతులు అమ్ముకుంటున్న పాకిస్తాన్ ప్రధాని?

By:  Tupaki Desk   |   21 Oct 2021 9:31 AM GMT
బహుమతులు అమ్ముకుంటున్న పాకిస్తాన్ ప్రధాని?
X
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ పరువు తీస్తున్నాడని ప్రతిపక్ష నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. పాకిస్తాన్ కు ఇతర దేశాల నుంచి వచ్చిన బహుమతులు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని వారంతా ఆరోపిస్తున్నారు. ప్రధాని ఇమ్రాన్ చర్యలతో తమ దేశ ప్రతిష్ట దిగజారుతోందని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇతర దేశాల నుంచి అందుకు ఓ విలువైన వాచ్ ను తన సన్నిహితుడి ద్వారా అమ్మించి ఆ డబ్బులను తన సొంత ఖాతాలో జమ చేసుకున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ బహుమతిని రూ.7.4 కోట్లకు అమ్మారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

సాధారణంగా ఒక దేశం మరొక దేశానికి బహుమతులు ఇస్తే.. గిఫ్ట్ డిపాజిటరీ నిబందనల ప్రకారం.. వాటిని బహిరంగ వేలంలో విక్రయించాలి.బహుమతులను తమ దేశ ఆస్తిగా ఉంచాలి.

కానీ ఇమ్రాన్ ఖాన్ కు గల్ఫ్ దేశాలకు చెందిన యువరాజు 1 మిలియన్ డాలర్ల విలువైన గడియారాన్ని బహుమతిగా ఇచ్చాడని.. దాన్ని ఇమ్రాన్ దుబాయ్ లో అమ్మేశాడంటూ ఆరోపణలు వినిపిస్తున్నారు. ఈ విషయం గిఫ్ట్ ఇచ్చిన యువరాజుకు తెలుసు అంటూ ప్రచారం సాగుతోంది.

ఇతర దేశాల నుంచి ఇలాంటి గిఫ్ట్ లను ఇమ్రాన్ ఖాన్ అమ్ముకున్నాడని పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఉపాధ్యక్షురాలు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ ట్వీట్ చేశారు. గిఫ్ట్ డిపాజిటరీ నుంచి విదేశీ బహుమతులను దోచుకుంటున్నాంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఇమ్రాన్ ఖాన్ ఇంతవరకూ స్పందించలేదు.