Begin typing your search above and press return to search.
లండన్ లో సామాన్యుడిగా తిరిగిన దుబాయ్ యువరాజు.. ఒక్కరూ గుర్తించలేదు!
By: Tupaki Desk | 16 Aug 2022 11:30 PM GMTఒక దేశానికి యువరాజు సామాన్యుడిలా మారిపోయాడు. లండన్ మెట్రోలో ఒక యువకుడిలా ప్రయాణించాడు. కానీ అతడో గొప్ప యువరాజు అని ఎవ్వరూ గుర్తించలేకపోయారు. ఈ ఘటన ఇంగ్లండ్ లోని లండన్ లో చోటుచేసుకుంది.
కుటుంబం, స్నేహితులతో కలిసి వెకేషన్ కోసం లండన్ వెళ్లిన దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ అల్ ముక్తమ్ ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసే వరకూ ఎవరూ గుర్తించలేకపోయారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.వాటిలో ఒకటి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
వాస్తవానికి రాజకుటుంబాలకు చెందిన వ్యక్తులు తమ విదేశీ పర్యటనల్లో ప్రత్యేక వాహనాల్లో ప్రయాణిస్తారు. కానీ దుబాయ్ యువరాజు మాత్రం సామాన్యుడిలా లండన్ మెట్రోను ఎంపిక చేసుకున్నారు. తన స్నేహితుడితో కలిసి మెట్రోలో ప్రయాణించాడు. ఆ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకోగా వైరల్ గా మారింది.
గ్రేటర్ లండన్, ఇంగ్లండ్ లోని బకింగ్ హమ్ షైర్, హెర్ట్ ఫోర్డ్ షైర్, పక్కనే ఉన్న కెంటీలలోని ప్రాంతాలను కలుపుతూ మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే రద్దీగా ఉన్న కంపార్ట్ మెంట్ లో తన స్నేహితుడు బద్ర్ అతీజ్ తో కలిసి యువరాజు అల్ ముక్తమ్ నిలబడి ప్రయాణించాడు. వీరిని తోటి ప్రయాణికులు ఎవరూ గుర్తించలేదు.
స్నేహితుడితో మెట్రోలో సెల్ఫీ దిగిన హమ్దాన్..దాన్ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ‘మేము చాలా దూరం వెళ్లాల్సి ఉంది. బద్ర్ ఇప్పటికే విసిగిపోయాడు’ అని దుబాయ్ యువరాజు క్యాప్షన్ ఇచ్చాడు.
దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా తన కుమారుడు షేక్ హమ్దాన్ తో కలిసి లండన్ కు వెళ్లారు. ఇన్ స్టాగ్రామ్ లో తండ్రి, తన ఇద్దరు కవల పిల్లలతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు. అయితే మెట్రోలో ప్రయాణించినప్పుడు జనం గుర్తించలేదు. కానీ గత నెల షేక్ హమ్దాన్ తన కారులో లండన్ లోని దుబాయ్ వాసులతో సెల్ఫీలు తీసుకుంటున్న ఓ వీడియో మాత్రం వైరల్ గా మారింది.