Begin typing your search above and press return to search.
సోనియా దూకుడు వెనుక అసలు సీక్రెట్ అదేనట
By: Tupaki Desk | 29 Aug 2020 5:30 AM GMTరాజకీయాలు మహా చిత్రమైనవి. అప్పటివరకు ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొనే నేతలు.. ఒక్క నిర్ణయంతో ఇమేజ్ మొత్తం మారిపోతుంది. మోడీ ప్రధానమంత్రి అయ్యాక.. కేంద్రంపై పోరుకు సరైన అంశాల్ని ఎంపిక చేసుకోవటంలో కాంగ్రెస్ వైఫల్యాన్ని పలువురు ఎత్తి చూపిస్తుంటారు. మోడీ సర్కారును ఇరుకున పెట్టేందుకు వీలుగా వ్యూహ రచనలో కాంగ్రెస్ దారుణంగా ఫెయిల్ అయ్యిందన్న విమర్శ కూడా ఉంది. ప్రజల మనసుల్ని దోచేలా నిర్ణయం తీసుకునే మోడీని డిఫెన్సులో పడేసేలా కాంగ్రెస్ తీరు లేదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది.
ఇలాంటివేళ.. పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సోనియా.. అనూహ్యంగా ఒక అంశాన్ని భుజాన ఎత్తుకోవటమే కాదు.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఒక తాటి మీదకు తీసుకురావటం తెలిసిందే. నీట్.. జేఈఈ పరీక్షల్ని నిర్వహించే విషయంలో కేంద్రం పట్టుదలగా ఉండటం.. అదే అంశాన్ని తాను టేకప్ చేసిన సోనియా.. సరైన సమయంలో తీసుకున్న సరైన అంశంగా పలువురు అభివర్ణిస్తున్నారు.
కరోనా వేళ.. చదువు కంటే ప్రాణాలు చాలా ముఖ్యమన్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి పరీక్షల్ని వాయిదా వేస్తే సరిపోయే దానికి భిన్నంగా ఎంట్రన్స్ టెస్టు నిర్వహించటంపై విద్యార్థులతో పాటు.. వారి తల్లిదండ్రులు సైతం ఇష్టపడటం లేదు. ఎక్కడ వెనుకబడి పోతామన్న భయంతో పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్నారే తప్పించి.. రేపొద్దున పరీక్ష రాసే క్రమంలో ఏదైనా ఇబ్బందులకు గురైతే పరిస్థితి ఏమిటన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఈ తరహా వాదనకు మరింత బలం చేకూరేలా సోనియాగాంధీ ఈ అంశాన్ని తీసుకోవటం.. ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా తన వాదనను వినిపిస్తోంది.
తాజాగా సోనియా గాంధీ సోషల్ మీడియాలో ఒక పోస్టు చేశారు. నిమిషం పాటు సాగే ఈ వీడియోలో స్పీక్ అప్ ఫర్ స్టూడెంట్స్ సేఫ్టీ అన్న హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. అందులో సోనియా మాట్లాడుతూ.. ‘‘మీరు క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నా ఆలోచన మీ చుట్టూనే తిరుగుతోంది. పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనేది చాలా కీలకం. ఇది కేవలం మీకే కాదు.. మీ తల్లిదండ్రులకు కూడా చాలా ముఖ్యం. మీరే మా భవిష్యత్తు.. మీ భవితే మాకు ముఖ్యం. మెరుగైన భారత్ మీపైనే ఆధారపడి ఉంది’’ అన్న మాటలు ఉన్నాయి.
ఇదంతా చూసినప్పుడు.. సరైన సమయంలో సరైన అంశాన్ని సోనియా టేకప్ చేశారని చెప్పాలి. ఎలాంటి సర్వే లేకుండా.. అభిప్రాయ సేకరణ జరపకుండా కేంద్రం అఖిల భారత స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పరీక్షలు సరికావన్న మాట వినిపిస్తోంది. ఇలాంటివేళలో.. లక్షలాది మంది విద్యార్థులు.. వారి తల్లిదండ్రుల మనోభావాలకు నిలువెత్తు రూపంగా కాంగ్రెస్ నిలవటం మోడీ సర్కారుకు ఇబ్బందికి గురి చేయటం ఖాయమంటున్నారు. అదే సమయంలో.. తమకు సంబంధించిన అంశాన్ని సోనియా స్వయంగా స్వీకరించి.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడటం కాంగ్రెస్ కు కొత్త బలాన్ని ఇవ్వటం ఖాయమంటున్నారు.
యువతను ప్రభావితం చేసే అంశాన్ని కాంగ్రెస్ టేకప్ చేస్తే..పార్టీ ఇమేజ్ మారటంతో పాటు.. ఆ వర్గాల్లో పార్టీపై సానుకూలత వస్తుందన్న వ్యూహం కూడా ఉందంటున్నారు. ఈ కారణంతోనే పరీక్షల వ్యవహారాన్ని సోనియా మరింత సీరియస్ గా తీసుకొని.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.మొత్తంగా చూస్తే.. ఈ వ్యవహారంతో తనలో చేవ ఏ మాత్రం తగ్గలేదన్న విషయాన్ని సోనియా స్పష్టం చేశారని చెప్పక తప్పదు.