Begin typing your search above and press return to search.

రికవరీ రేటు పెరుగుతుంది కానీ, 24గంటల్లో ఎన్ని మరణాలంటే ?

By:  Tupaki Desk   |   27 May 2021 9:30 AM GMT
రికవరీ రేటు పెరుగుతుంది కానీ, 24గంటల్లో ఎన్ని మరణాలంటే ?
X
మనదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభన కొనసాగుతోంది. ప్రతి నిత్యం లక్షలాది మంది కరోనా బారిన పడుతున్నారు. దేశంలో మరణాల సంఖ్య పెరగుతుండటం ఆందోళన కలిగిస్తోంది , అయితే ,కరోనా వైరస్ కేసుల సంఖ్య కొంతమేర తగ్గుముఖం పట్టింది. దేశంలో గడచిన 24 గంట‌ల సమయంలో కొత్త‌గా 2,11,298 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, నిన్న 2,83,135 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,73,69,093కు చేరింది. మరో 3,847 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,15,235కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,46,33,951 మంది కోలుకున్నారు. 24,19,907 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌ లలో చికిత్స అందుతోంది. ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 20,26,95,874 కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దేశంలో 89.66 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉన్నట్లు చెబుతున్నప్పటికీ.. మరణాల సంఖ్య సంఖ్య తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం కేసులు ఒక్కసారిగా రెండు లక్షలకి దిగువగా నమోదు అవ్వడంతో లాక్ డౌన్ మంచి ఫలితాన్ని ఇస్తోందని, కరోనా విజృంభణ తగ్గుతోందని అనుకున్నారు. అయితే బుధవారం 2,11,298కి పాజిటివ్ కేసులు, 3,847 మంది మృతిచెందినట్లు లెక్కలు చెప్తున్నాయి. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 3,15,235 మంది కరోనాతో చనిపోయినట్లు అయ్యింది. ఈ కేసులతో మరణాల రేటు 1.15 శాతానికి చేరుకుంది. ఇక గత 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 2,83,135. దేశంలో ఇప్పటిదాకా 2,73,69,093 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 9.19 శాతంగా, యాక్టీవ్ కేసుల సంఖ్య 24,19,907గా ఉంది.