Begin typing your search above and press return to search.
ఇంత జరిగిన తర్వాత కూడా మీసం మెలేస్తూ.. ఓవరాక్షన్ ఏంది రఘురామ
By: Tupaki Desk | 18 May 2021 4:30 AM GMTఏం అనుకుంటారో? మరేం ఆలోచిస్తారో తెలీదు కానీ.. కీలక స్థానాల్లో ఉన్న వారు చేసే కొన్ని చేష్టల్ని చూస్తే షాక్ తినాల్సిందే. తాజాగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు తీరు ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. ఏపీ ప్రభుత్వాన్ని.. ప్రభుత్వాధినేతను కించపరస్తూ వ్యాఖ్యలు చేయటం.. ఈ నేపథ్యంలో ఆయనపై కేసులు నమోదు చేసి ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేయటం.. అనంతరం చోటు చేసుకున్న హైడ్రామా తెలిసిందే.
మూడు రోజుల పాటు నాన్ స్టాప్ గా చోటు చేసుకున్న పరిణామాలతో సోమవారం రాత్రి సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రి వద్దకు రఘురామను తీసుకురావటంతో ఇష్యూ ఒక కొలిక్కి వచ్చినట్లుగా చెప్పాలి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో గుంటూరు జిల్లా జైలు నుంచి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సోమవారం గుంటూరు నుంచి హైదరాబాద్ కు తరలించే క్రమంలో.. ఈ కార్యక్రమాన్ని కవర్ చేయటానికి మీడియా పెద్ద ఎత్తున చేరుకుంది.
ఎప్పుడూ లేనిది మీడియా కనిపించినంతనే ఎంపీ రఘురామ మీసాన్ని మెలేయటం ఆసక్తికరంగా మారింది. తనను కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు తనను తీవ్రంగా కొట్టారంటూ కాళ్ల మీద గాయాల్ని చూపించటం.. బెయిల్ కోసం అభ్యర్థించటం తెలిసిందే. మీడియా కనిపించినంతనే మీసాన్ని మెలేసిన వైనం చూస్తే.. రఘురామ ఏదో సందేశాన్ని ఇస్తున్నట్లుగా భావిస్తున్నారు.
తనను జైలుకు పంపాలని సీఐడీ అధికారులు ఎంతలా ప్రయత్నించినా.. వారి పాచిక పారకుండా చేయటంలో తాను సక్సెస్ అయ్యానన్న సంకేతాన్ని తెలియజేయటమే ఉద్దేశమా? అన్నది ప్రశ్నగా మారింది. తనను బలవంతంగా జైలుకు పంపాలన్న ఎత్తుగడ బెడిసి కొట్టటం.. నైతికంగా చూస్తే తాను విజయం సాధించానని చెప్పేందుకే మీసాన్ని అదే పనిగా మెలేసినట్లుగా భావిస్తున్నారు. అయితే.. ఇదంతా మైండ్ గేమ్ లో భాగమన్న మాట వినిపిస్తోంది.
తనను బలహీనపర్చాలని అనుకున్నా.. తాజా పరిణామాలతో తాను బలహీనం కాలేదని.. బలంగా ఉన్నానన్న సందేశాన్ని ఇవ్వటంతో పాటు.. ప్రత్యర్థులకు ఒళ్లు మండేలా చేయటం కూడా మీసం మెలేయటం వెనుకున్న ఆలోచనగా అభిప్రాయపడుతున్నారు. రాజకీయ విభేదాలతో ప్రభుత్వం కేసులు పెట్టి.. తనను టార్గెట్ చేస్తుందన్న సందేశాన్ని ఇవ్వటం బాగానే ఉన్నా.. ఇలా మీసం మెలేయటం మాత్రం రఘురామకు నెగిటివ్ గా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి తీరు.. న్యూట్రల్ గా ఉన్న వారిని దూరం చేయటంతో పాటు.. రఘురామ మీద మరింత చర్యకు పురిగొల్పేలా రెచ్చగొట్టినట్లు అవుతుందన్న మాట వినిపిస్తోంది.