Begin typing your search above and press return to search.
గురువుకు జగన్ ఇచ్చిన గౌరవం!
By: Tupaki Desk | 5 Sept 2020 4:00 PMఈరోజు టీచర్స్ డే. దీంతో అందరూ తమ గురువులను గుర్తు చేసుకుంటున్నారు. తన తండ్రి కలను ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారు. వైఎస్ఆర్ కు చదువుచెప్పిన వెంకటప్ప అంటే ఆయనకు ఎంతో అభిమానం. ఆయన పేరిట స్కూల్ ను రాజశేఖర్ రెడ్డి గతంలో కట్టించాడు. ఆ తర్వాత వైఎస్ఆర్ ఫౌండేషన్ కింద జగన్ ఇంగ్లీష్ మీడియంను పులివెందులలోని బకరాపురంలోని 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. 2007లో ప్రారంభమైన ఈ స్కూలులో మౌళిక సదుపాయాలు భేష్ గా ఉన్నాయి. మొత్తంగా 46 తరగతి గదులు ఉండగా.. సకల సౌకర్యాలున్నాయి.
ఇక విద్యార్థులను ఇంటి నుంచి స్కూలుకు.. తిరిగి స్కూలుకు చేర్చేందుకు బస్సులను జగన్ ఏర్పాటు చేయించారు. ఇక విద్యార్థులకు మొత్తం వైఎస్ఆర్ ఫౌండేషన్ భరిస్తోంది. తెల్లరేషన్ కార్డు ఉన్న పిల్లలకు సీటు ఇస్తారు. పేదల పిల్లలకు ఉచితంగా మంచి విద్యనందిస్తారు.
జగన్ సీఎం అయ్యాక.. ఆయన భార్య భారతి దీనిని పర్యవేక్షిస్తున్నారు. తండ్రి గురువైన వెంకటప్ప పేరుతో జగన్ ఆ స్కూల్ ను ఇప్పటికీ రన్ చేస్తున్నారు. కడప ఎంపీగా ఉన్న సమయంలోనే దాన్ని టేకప్ చేశారు. టీచర్స్ డే సందర్భంగా జగన్ చేస్తున్న సేవలను పలువురు కొనియాడుతున్నారు.