Begin typing your search above and press return to search.
‘చిల్ ట్రంప్’ ఎట్టకేలకు పగ సాధించిన పర్యావరణ కార్యకర్త గ్రెటా!
By: Tupaki Desk | 6 Nov 2020 12:50 PM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు డొనాల్డ్ ట్రంప్‌కు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధిద్దామనుకున్న ట్రంప్‌కు ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. మొదట్లో కొన్ని రాష్ట్రాల్లో ఆధిక్యం ప్రదర్శించినట్టు కనిపించినా రానురాను ప్రత్యర్థి బైడెన్ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తున్నారు. ఇంకో ఆరు ఎలక్ట్రోరల్ సీట్లు సాధిస్తే బైడెన్ విజయం సాధించినట్టే. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్వీట్లలో ప్రత్యర్థులపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఓ దశలో అతడి ట్వీట్లను ట్విట్టర్ వరసగా తొలగించివేసింది. మరోవైపు కోర్టుకు వెళ్లాలన్న ఆశలు కూడా అడుగంటాయి. దీంతో ట్రంప్‌పై అతడి పాత శత్రువులు విరుచుకుపడుతున్నారు. గతంలో ఓసారి స్వీడిష్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ ను ఎగతాళి చేస్తూ ట్రంప్ ట్వీట్ పెట్టాడు. 2019లో టైమ్ మ్యాగజైన్ గ్రెటా థన్‌బెర్గ్ ను ‘ఇయర్ ఆఫ్ ది పర్సన్’ పేరుతో సత్కరించింది.
ఈ సందర్బంగా ట్రంప్ ఆమెను ఎగతాళి చేస్తూ ట్వీట్ పెట్టాడు. ‘చిల్ గ్రెటా నీకు అవార్డు రావడం చాలా హాస్యాస్పదం. ఈ వయసులో నువ్వు స్నేహితుడితో ఫ్యాషన్ సినిమాకు వెళ్లాలి. కానీ అవార్డులు ఏమిటి’ అంటూ ట్వీట్ పెట్టాడు. దీంతో ఆమె ఎంతో నొచ్చుకున్నది. సమయం కోసం వెయిట్ చేసింది. ప్రస్తుతం అమెరికాలో డెమొక్రాట్ జో బైడెన్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని చేరువులో ఉన్నారు. ట్రంప్ ఓటమిని అంగీకరించలేక "స్టాప్ ది కౌంట్!" అంటూ రగిలిపోతున్నాడు. టైం కోసం వెయిట్చేసిన గ్రెటా పగ సాధించుకున్నది. ‘చిల్ ట్రంప్.. ఇటువంటి సమయంలోనే మీరు యాంగర్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టాలి. మీ స్నేహితుడితో కలిసి ఏదైనా మంచి పాత ఫ్యాషన్ సినిమాకు వెళ్లండి! చిల్, డొనాల్డ్, చిల్!" అంటూ థన్‌బర్గ్ గురువారం ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. గ్రెటాకు రీట్వీట్లు లైకులు మారుమోగిపోతున్నాయి.