Begin typing your search above and press return to search.

ప్రాస ఓకే కానీ పంచ్ మిస్ అయ్యింది చిన బాబు

By:  Tupaki Desk   |   11 Nov 2019 4:23 AM GMT
ప్రాస ఓకే కానీ పంచ్ మిస్ అయ్యింది చిన బాబు
X
నిద్ర లేచింది మొదలు పడుకునే వరకూ.. ప్రతి విషయాన్ని భూతద్దం లో చూడాలి. ఏదో ఒక పాయింట్ పట్టుకున్నట్లు గా భ్రమించేలా చేయాలి. దానికి ప్రాస లాంటి షుగర్ కోటింగ్ తగిలించి.. అయితే ట్విట్టర్ పిట్ట తోనో.. లేదంటే ఫేస్ బుక్ పోస్టు తోనో ప్రయత్నం చేయాలి. మొత్తంగా జగన్ పాలనను తప్పు పట్టేలా.. దుమ్మెత్తి పోసే చందంగా తిట్టిపోయాలన్నఎజెండా లో భాగంగా టీడీపీ చిన బాబు మరో ప్రయత్నం చేశారు.

విజనరీ లీడర్ కు.. పాయిజన్ లీడర్ కు తేడా ఏంటో తెలుసా? అంటూ సెటైర్లు వేసే ప్రయత్నం చేశారు. విజన్ ఉన్న లీడర్ రాబోయే సంక్షోభాన్ని ముందుగా పసి గట్టి నివారణ కోసం చర్యలు తీసుకుంటారని.. చంద్రబాబు లాంటి లీడర్ ఆలోచనలో నుంచి పుట్టిందే పట్టి సీమ అని చెప్పారు.

ఒంటి నిండా పాయిజన్ ఉన్న లీడర్ ముందు చూపు లేక వరదలు వచ్చినా.. ఆ నీటిని వినియోగించుకో లేక సముద్రం పాలు చేస్తున్నట్లు మండి పడ్డారు. పనికి రాని పట్టి సీమ అన్న వారే.. మళ్లీ మోటార్లు ఆన్ చేస్తున్నట్లు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. నిజం గానే చంద్రబాబు లో అంత ముందు చూపే ఉండి ఉంటే.. గోదావరి పుష్కరాల సందర్భంగా అంతమంది ఎందుకు చనిపోయినట్లు? బాబు సోకు కోసం.. డాబు కోసం చేసిన ప్రచార కక్కుర్తి కి అంతమంది బలి అయ్యారన్న విషయాన్ని లోకేశ్ ఎలా మర్చిపోతారు?

అంత విజనరీ నే అయితే.. బ్రహ్మండం బద్ధలు కొట్టినట్లు గా గొప్పలు చెప్పే చంద్ర బాబు.. తాను నిర్మించిన తాత్కాలిక సెక్రటేరియట్ వర్షం వస్తే చాలు.. ఆఫీసు లోపల కాగితం పడవలు వేసుకునే దుస్థితి ఎందుకు వచ్చినట్లు? వాన జల్లు పడితే చాలు.. అమరావతి ప్రాంతం లో కాలు పెట్ట లేని పరిస్థితి ని చూస్తేనే.. అర్థమవుతుంది చంద్రబాబు విజనరీ. తాము ఒక మాట అంటే.. తమను పది మాటలు అనటాని కి సరిపడా తమ తప్పులు ఉన్నాయన్న విషయం తెలిసి మరీ కెలికి తిట్టించు కోవటం పెద్ద బాబు.. చిన బాబులకు మాత్రమే చెల్లుతుందేమో?