Begin typing your search above and press return to search.
కోడి పంచ్ కు కోడికత్తి రిప్లై.. ఎంపీ రఘురామ వర్సెస్ విజయసాయిరెడ్డి ట్వీట్ వార్
By: Tupaki Desk | 25 Jan 2022 7:31 AM GMTఓవైపు వివాదాస్పద ఎంపీ రఘురామ.. మరోవైపు ప్రత్యర్థులను చెడుగుడు ఆడే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. వీరిద్దరూ ఇద్దరే.. ఎవరూ తగ్గేదేలే అన్నట్టుగా ఉంటారు. తాజాగా వీరిద్దరి మధ్య ట్వీట్ వార్ మొదలైంది. ఏపీలో వైసీపీ తరుఫున గెలిచి ఆ పార్టీపైనే పోరాటం చేస్తున్న రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును టార్గెట్ చేసుకొని తాజాగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రారంభించిన ట్వీట్ వార్ పతాకస్థాయికి చేరుకుంది.
విజయసాయిరెడ్డి ట్వీట్లకు ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా రెచ్చిపోతుండడంతో పంచ్ ల మీద పంచ్ లు పేలుతున్నాయి. ఇవి సహజంగానే అభిమానులకు పండుగలా మారిపోతున్నాయి. వీరిద్దరి ట్వీట్ పంచ్ లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామపై అనర్హత వేటు వేయించాలని వైసీపీ అధిష్టానం చేయని ప్రయత్నం లేదు. అయినా అది సాధ్యం కాలేదు. తనపై అనర్హత వేటు వేయించడం చేతకాకపోతే చెప్పండి తానే రాజీనామా చేసేస్తానంటూ రఘురామ ప్రారంభించిన మైండ్ గేమ్ వైసీపీని చికాకు పెడుతోంది. దీంతో రఘురామను టార్గెట్ చేసేందుకు వైసీపీ సీనియర్ ఎంపీ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ట్వీట్ వార్ ముదిరిపోయింది. అదిప్పుడు పతాకస్థాయికి చేరింది.
రఘురామను టార్గెట్ చేసుకొని సాయిరెడ్డి నిత్యం పెడుతున్న ట్వీట్లకు కౌంటర్లు కూడా అదే స్థాయిలో పడుతున్నాయి. ఇటు సాయిరెడ్డి కానీ.. రఘురామ కానీ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. సహజంగానే ప్రత్యర్థులపై ట్వీట్లతో విరుచుకుపడుతుండడంలో వీరిద్దరూ ఆరితేరారు. ఇప్పుడు పరస్పరం విసురుతున్న పంచ్ లతో ట్వీట్ వార్ పతాకస్తాయికి చేరింది.ఇందులో ఎన్నో విషయాలు చర్చకు వస్తున్నాయి.
ఈ ట్వీట్ వార్ ను విజయసాయిరెడ్డి మొదలుపెట్టాడు. ‘కోడి పందాలు మా సంస్కృతి అంటూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు. అందరూ అతన్ని పందెం కోడి అనుకున్నారు. కానీ అతను ఫారం కోడి అని తేలిపోయింది. టీడీపీ ట్యూన్లకు రికార్డింగ్ డాన్స్ వేసే డాన్సింగ్ రాజా అతను. ఆ నర్సాపురం పంజరం చిలుక ఢిల్లీలో కూర్చుని పలికేవన్నీ పచ్చ గ్యాంగ్ రాసిచ్చిన పలుకులే.’ అని ఎంపీ రఘురామకృష్ణంరాజుపై పరోక్షంగా విరుచుకుపడ్డారు.
దీనికి ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ‘కోడి కత్తిని అడ్డంపెట్టుకుని వచ్చిన మీరు ఇంత కన్నా ఏమంటారులే. ఎలాగో నీకు రాజ్యసభ రెన్యువల్ లేదు కాబట్టి నువ్వు నా మీదకు పందెం కోడిగా రా. నీ ఈకలు పీకి పంపిస్తా! అవునుకానీ, నువ్వు ఏ1 ట్యూన్స్ కి డాన్స్ చేస్తున్నావా లేక విశాఖలో ఇంకెవరైనా కడుతున్న ట్యూన్స్ కి డాన్స్ చేస్తున్నావా?’ అని విజయసాయిని కడిగిపారేశారు.