Begin typing your search above and press return to search.

అపార్టుమెంట్ లో పెళ్లైన కొత్త జంట శృంగార రచ్చ.. కేసు వరకు వెళ్లింది

By:  Tupaki Desk   |   13 July 2022 4:37 AM GMT
అపార్టుమెంట్ లో పెళ్లైన కొత్త జంట శృంగార రచ్చ.. కేసు వరకు వెళ్లింది
X
విషయం ఏదైనా సరే మితంగా ఉంటే ఓకే. అందుకు భిన్నంగా మోతాదు మించితే ఉండే ఇబ్బందులు అన్నిఇన్ని కావు. తాజాగా అలాంటి ఉదంతం ఒకటి రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ లో చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లైన నవ జంట ఘాటు రొమాన్సుకు చుట్టుపక్కల వారు భరించలేనంతగా మారటం.. చివరకు విషయం పోలీసు స్టేషన్ వరకు వెళ్లిన వైనం షాకింగ్ గా మారింది. అందరిని ఆకర్షిస్తున్న ఈ ఉదంతంలోకి వెళితే..

జైపూర్ కు చెందిన నవ జంటకు కొత్తగా పెళ్లైంది. కొత్తగా పెళ్లైన వారిలో సహజంగా ఉండే శృంగార ఆసక్తి ఈ జంటకు ఉంది. కరోనా కారణంగా ఇప్పటికి పలు ఐటీ కంపెనీలు ఇంటి నుంచే పని చేసే అవకాశాన్ని కల్పిస్తున్న నేపథ్యంలో..

ఈ జంట సైతం ఇంట్లో నుంచి పని చేస్తున్నారు. ఏ మాత్రం ఖాళీ దొరికినా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతవరకు ఓకే. కానీ.. ఈ జంట శృంగారం చేసే సమయంలో పోటాపోటీగా చేసే వారి శబ్దాలు ఇబ్బందికరంగా మారటమే కాదు.. చుట్టుపక్కల వారికి పెద్ద తలనొప్పిగా మారింది.

సాధారంగా శృంగార వేళ చేసే శబ్దాలు నాలుగు గోడలు దాటకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ.. ఈ జంట అందుకు భిన్నంగా ఎవరేం అనుకున్నా సరే.. తాము మాత్రం చుట్టూ ఉన్న లోకాన్ని మర్చిపోయి చెలరేగిపోతున్నారట. పగలు..

రాత్రి అన్న తేడా లేకుండా వారు చేసే శృంగార శబ్దాలకు చుట్టూ ఉన్న ప్లాట్ల వారికి తీవ్ర అసౌకర్యంగా మారిందట. మొదట్లో కాస్త భరించినా.. తర్వాత భరింలేని వారు ఆ జంటకు సున్నితంగా మందలిస్తూ.. కాస్తంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారట.

అయినప్పటికీ వారు పెద్దగా పట్టించుకోకుండా తమకు తోచినట్లుగా ఉండటంతో ఆగ్రహించిన సదరు అపార్ట్ మెంట్ వాసులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారట. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ఈ జంటను స్టేషన్ కు పిలిపించి వార్నింగ్ ఇవ్వటంతో పాటు.. న్యూసెన్సు కేసు నమోదు చేసి షాకిచ్చారట. అతితో అనవసరమైన తలనొప్పులు తెచ్చుకోవటం అంటే ఇదే కదూ?