Begin typing your search above and press return to search.

బయటపడనున్న రాజుగారి బండారం ?

By:  Tupaki Desk   |   5 July 2021 5:24 AM GMT
బయటపడనున్న రాజుగారి బండారం ?
X
ఎంతో ప్రతిష్టాత్మకమైన మాన్సాస్ ట్రస్టు ఇపుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ట్రస్టులో జరుగుతున్న కార్యకలాపాల సంగతి పక్కనపెట్టేస్తే రాజకీయంగా బాగా వివాదాస్పదమైపోయింది. మాన్సాస్ లో అక్రమాలు భారీ ఎత్తున జరిగాయన్నది వాస్తవం. అయితే అందుకు బాధ్యులెవరనే విషయంలోనే ట్రస్టు ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు, మాజీ ఛైర్ పర్సన్ సంచైతా గజపతిరాజ+వైసీపీ నేతల మధ్య వివాదాలు పెరిగిపోతున్నాయి. ఈరోజు నుండి మాన్సాస్ ట్రస్టు ఆడిటింగ్ మొదలవ్వబోతోంది.

అక్రమాలకు మీరే కారణమంటే కాదు మీరే కారణమంటూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అశోక్+టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం పసలేదన్న విషయం అందరికీ తెలిసిపోతోంది. ఎందుకంటే ట్రస్టు బాధ్యతలు సంచైతకు దక్కింది కేవలం ఏడాది క్రితం మాత్రమే. అంతకుముందు వరకు అశోక్, ఆయన సోదరుడు ఆనంద్ చేతిలోనే ఉండేది యావత్ అధికారమంతా.

టీడీపీ హయాంలోనే అవినీతి జరిగిందనేది అనేక ఆదారాలున్నాయి. పార్టీ నేతలకు పదుల సంఖ్యలో ఎంతో విలువైన భూములను అశోక్ కట్టబెట్టేశారు. ఈమధ్యనే బయటపడిన లెక్కలో రానీ 750 ఎకరాల భూమి వివరాలు బయటపడటం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే ఈరోజు నుండి ట్రస్టు ఆడిట్ మొదలవ్వబోతోంది. ప్రపంచానికి నీతులు చెబుతున్న అశోక్ గడచిన 16 ఏళ్ళుగా ఎందుకని ఆడిటింగ్ చేయించలేదో జవాబు చెప్పాలి.

ఆర్ధిక వ్యవహారాలున్న సంస్ధల్లో ప్రతిఏడాది ఆడిటింగ్ తప్పదన్న కనీస ఇంగితం కూడా అశోక్ కు లేదా ? ట్రస్టు ఛైర్ పర్సన్ గా బాధ్యతలు తీసుకోగానే ఇదే విషయాన్ని సంచైత చెప్పారు. తన బాబాయ్ హయాంలో అసలు ఆడిటింగే జరగలేదని అప్పట్లో సంచైత చెప్పటంతో అసలు విషయం బయటకువచ్చింది. అంటే ట్రస్టు ఆదాయాన్ని అషోక్ తనిష్ట ప్రకారం ఉపయోగించుకున్న విషయం బయటపడింది.

ఈరోజు మొదలవ్వబోతున్న ఆడిట్ తో ట్రస్టు భూముల లీజు, రావాల్సిన లీజు మొత్తం, వస్తున్న లీజుతో పాటు ఎవరెవరికి ఎంతంత భూములను ట్రస్టు లీజుకిచ్చింది ? లీజు ఎవరిచ్చారు ? జీతబత్యాల రూపంలో ఎంత ఖర్చవుతోంది ? ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు ఎందుకని ఆగిపోయాయి లాంటి అనేక అంశాలు ఇఫుడు బయటపడబోతున్నాయి. మొత్తానికి రాజుగారి హయాంలో జరిగిన అక్రమాలన్నీ తొందరలోనే బయటపడబోతున్నాయి. మరపుడు ఏం మాట్లాడుతారో చూడాలి.