Begin typing your search above and press return to search.

పెచ్చుమీరుతున్న తాలిబన్ల ఆంక్షలు.. చీకటి రోజుల్లోకి మహిళలు..!

By:  Tupaki Desk   |   11 Nov 2022 5:50 AM GMT
పెచ్చుమీరుతున్న తాలిబన్ల ఆంక్షలు.. చీకటి రోజుల్లోకి మహిళలు..!
X
అమెరికా చేతగానీ తనానికి ఆఫ్షనిస్తన్ లోని అమాయక ప్రజలు శిక్షను అనుభవిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ 11న అఫ్గాన్ భూభాగం నుంచి అమెరికా తన సేనలను ఉపహరిస్తున్నట్లు ప్రకటించింది. ఈక్రమంలోనే తాలిబన్లు క్రమంగా గ్రామాలు.. పట్టణాలను ఆక్రమిస్తూ పోయారు. నాటి ప్రజా ప్రభుత్వాన్ని తాలిబన్లు కూలగొట్టి వారే సొంతంగా పాలన సాగించనున్నట్లు ప్రకటించడం యావత్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసింది.

తాలిబన్ల ప్రకటనపై ఆ దేశంలో పెద్దఎత్తున నిరసనలు వచ్చాయి ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. అయితే ఈ నిరసనలను తాలిబన్లు నిర్దాక్షిణ్యంగా అణిచి వేశారు. ఎవరైనా ఎదిరిస్తే కాల్చివేయడం.. భయాభ్రాంతులకు గురిచేయడం లాంటివి సాగాయి. ఈ నేపథ్యంలోనే గత కొన్నినెలలుగా ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ల పాలన కొనసాగుతూ వస్తోంది.

అయితే గత 20 ఏళ్ళ క్రితం ఆప్గాన్ లో తాలిబన్ల పాలనే కొనసాగింది. నాటి పాలనలో మహిళలపై అనేక ఆంక్షలు ఉండేవి. ఆ దేశంలో మహిళలకు స్వేచ్ఛగా తిరిగే హక్కు కూడా ఉండేది కాదు. మతచందస వాదుల పాలనలో మహిళలు ఎంతగానో బాధలను అనుభవించాల్సి వచ్చేది. ఇలాంటి సమయంలోనే అంటే 2001లో అమెరికా నాటి తాలిబన్ ప్రభుత్వాన్ని కూలగొట్టింది.

దాదాపు 20ఏళ్లుపాటు అమెరికా సైనికులు అఫ్గాన్ లోనే ఉన్నారు. అమెరికా సహకారంతో ఆప్ఘాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈక్రమంలోనే మహిళలపై క్రమంగా ఆంక్షలు తొలగించబడ్డాయి. అక్కడి మహిళలు సైతం మగవాళ్లతో సమానం హక్కులను పొందారు. బయటికి వెళ్లి చదువుకునే వెసులుబాటు రావడంతో మహిళలు సైతం ఉద్యోగాలు చేసే వాతావరణం ఏర్పడింది.

ఇక ఎప్పుడైతే అమెరికా సేనలు అప్ఘాన్ విడిచి వెళ్లాయో నాటి నుంచి తాలిబన్లు పెచ్చుమిరిపోయారు. తాలిబన్లే సొంతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని పాలన సాగిస్తున్నారు. ఈక్రమంలోనే మహిళలపై పలురకాల ఆంక్షలు పెడుతున్నారు. తొలుత విద్య.. ప్రయాణాలపై ఆంక్షలను విధించారు. తమ ఆంక్షలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.

ఆరో తరగతి తర్వాత ఆడ పిల్లలకు విద్యను నిషేధించారు. మహిళలు ఒంటరి ప్రయాణాలు చేయరాదని.. మీడియా సంస్థల్లో పని చేయకూడదని తాలిబన్ ప్రభుత్వం జారీ చేసింది. స్త్రీలు బయటకు వెళ్లాలంటే బురఖా లేదా ఇస్లామిక్ స్కార్ఫ్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఇక తాజాగా మరోసారి మహిళల హక్కులను కాలరాసే నిర్ణయం తీసుకుంది.

ఇకపై మహిళలు జిమ్.. పార్కులకు వెళ్లరాదని తాలిబన్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయండి. మగ.. ఆడ అనే బేధం లేకుండా ప్రతీ ఒక్కరూ ప్రవర్తిస్తున్నారని.. హిజాబ్ లేకుండానే మహిళలు బయటికి వస్తున్నారనే కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని అఫ్ఘనిస్థాన్ వైస్ వర్చ్యూ శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ అకేఫ్ మొహజెర్ వెల్లడించారు. మహిళలపై ఇలాంటి ఆంక్షలు చూస్తుంటే వారంతా మళ్లీ చీకటి రోజులకు వెళుతున్నారా? అన్న భావన కలుగకమానదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.