Begin typing your search above and press return to search.
రూ.200 కోట్ల ప్రాజెక్టుపై అధికార పార్టీ కన్ను
By: Tupaki Desk | 10 Feb 2020 6:30 PM GMTఅధికార వికేంద్రీకరణ లో భాగంగా విశాఖ పట్నానికి మరో రాజధాని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా విశాఖపట్టణంలో పరిణామాలు మారుతున్నాయి. అధికార పార్టీ విశాఖ కు రాజధాని తరలించాలని గట్టి పట్టుదల తో ఉంది. ఈ నేపథ్యం లో అందుకనుగుణంగా అడుగులు పడుతుండగా విశాఖపట్టణంలో అధికార పార్టీ నాయకులకు పండగే పండగగా ఉంది. విశాఖలోని పలు విలువైన స్థలాలు, వివాదాస్పద వాటిపై కన్నేశారు. సాగర తీరంలో రూ.200 కోట్ల విలువైన ప్రాజెక్ట్ కార్తీకవనం ఉంది. దీనిపై ఇప్పటికే అధికార పార్టీ నేత కన్ను పడిందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
విశాఖలోని బీచ్ రోడ్డు లో సముద్ర తీరాన్ని ఆనుకుని ఎండాడ గ్రామం సర్వే నం.106లో విశాఖపట్నం మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) (అప్పట్లో వుడా)కు నాలుగు హెక్టార్ల భూమి (నాలుగు ఎకరాలు) ఉండేది. ఆ స్థలాన్ని ఎకో టూరిజం ప్రాజెక్టు గా అభివృద్ధి చేస్తామంటూ ఓ పెద్ద మనిషి రాజకీయ పలుకు బడితో ముందుకు రాగా, మ్యాక్ లీజర్స్ సంస్థతో వుడా 2002 మే 22న ఒప్పందం చేసుకుంది. ఆ భూమిని 33ఏళ్ల లీజుకు బీఓటీ విధానంలో అప్పగించింది. ఆ స్థలంలో ‘కార్తీకవనం’ పేరుతో ఎథ్నిక్ బీచ్ రిసార్ట్ కడతామని నిర్ణయించి ఒప్పందం అనంతరం అభివృద్ధి పనులు ప్రారంభించారు. అయితే అటవీ అధికారులు అడ్డుకుని ఆ స్థలంలో తమ శాఖకు 3.27ఎకరాల భూమి ఉందని, దాన్ని వుడా లీజుకు ఎలా ఇస్తుందని నిలదీశారు. సీఆర్‌జెడ్ పరిధిలో ఉండడంతో పనులు చేపట్టడానికి వీల్లేదని అడ్డుకున్నారు.
ఇది వాస్తవమేనని గుర్తించి అధికారులు అటవీ శాఖకు మరోచోట ఆ భూమికి ప్రత్యామ్నాయం కేటాయించారు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అనుమతులు ఢిల్లీలో పొంది, పనులు మొదలెట్టేందుకు పదేళ్లు గడిచింది. ఈ క్రమంలో మ్యాగ్ లీజర్స్ ను సంస్థను వేరొకరు టేకోవర్ చేసి అదే పేరుతో కొనసాగిస్తున్నారు. 17ఏళ్లు గడిచిపోగా ప్రాజెక్టు ఇప్పుడు తుదిదశకు చేరుకుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ను చేపట్టడానికి రాడిసన్ గ్రూపు ముందుకు వచ్చింది. ఇదే సమయంలో రాష్ట్రంలో అధికారం వైఎస్సార్సీపీకి వచ్చింది. ఈ సమయంలో రాజధానిని విశాఖ కు తీసుకురావాలని సీఎం జగన్ నిర్ణయించడం తో ఆ పార్టీకి చెందిన నేతలు విశాఖలో విలువైన భూములు, ప్రాజెక్టులు, వివాదాస్పద స్థలాలపై కన్నేశారు. ఈ క్రమంలోనే కార్తీకవనం కనపడింది.
వెంటనే పోలీసు అధికారి జోక్యంతో ఆ ప్రాజెక్టు గేటుకు తాళాలు వేసి పెద్దలతో మాట్లాడుకోండి అని ప్రాజెక్టు బాధ్యులకు వర్తమానం వెళ్లింది. ఈ విషయమై విశాఖలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతకు ఫోన్ లో సంప్రదించినా ఫలితం లేకపోయే. దీంతో తెలిసిన వ్యక్తులను తీసుకుని నేరుగా వెళ్లి చర్చలు జరిపారు. చివరకు 50శాతం వాటా ఇచ్చే ప్రతిపాదనతో డీల్ ఓకే చేసుకున్నారు. తెలంగాణకు చెందిన వ్యక్తితో అందులో 50శాతం వాటా పెట్టించారు. ఈ విధంగా అధికార పార్టీ నేతలు ఆ ప్రాజెక్ట్ పై కన్నేయడం విమర్శలకు దారి తీస్తోంది.
విశాఖలో రాజధాని ఏర్పాటైతే ముఖ్యమంత్రి కి ఓ నివాసం అవసరం. అందుకే ఈ కార్తీకవనం ప్రాజెక్ట్ లోనే ముఖ్యమంత్రి నివాసం ఏర్పాటు చేయడానికి ఈ ప్రాజెక్ట్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అందుకే ఈ స్థలంపై ఆ పార్టీ నాయకులు కన్నేశారని తెలుస్తోంది.