Begin typing your search above and press return to search.

పరిషత్ లకు మోక్షమెప్పుడో ?

By:  Tupaki Desk   |   23 July 2021 12:30 PM GMT
పరిషత్ లకు మోక్షమెప్పుడో ?
X
అప్పుడెప్పుడో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికలకు మోక్షమెప్పుడో తెలీటంలేదు. నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వలేదన్న కారణంతో పరిషత్ ఎన్నికలను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేస్తు తీర్పిచ్చింది. అయితే సింగిల్ బెంచ్ తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో రివ్యూ పిటీషన్ కూడా వేసింది. ఈ కేసులపై విచారణ ఎప్పుడు జరుగుతుందో ? తీర్పు ఎప్పుడు వస్తుందో జనాలకు అర్ధం కావటంలేదు.

నిజానికి పరిషత్ ఎన్నికలకు ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వలేదు. స్టేట్ ఎలక్షన్ కమీషన్ మాజీ కమీషనర్ నిమ్మగడ్డ హయంలో జారీఅయిన నోటిఫికేషన్నే ప్రస్తుత కమీషనర్ నీలం సాహ్ని అమల్లోకి తెచ్చారంతే. నిమ్మగడ్డ హయాంలో ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియను వారం రోజులు గ్యాప్ ఇచ్చి నీలం ఎన్నికలను నిర్వహించారు. దీనిపై టీడీపీ+జనసేన పార్టీలు కోర్టును ఆశ్రయించాయి. ఏకగ్రీవమైన స్ధానాలను కలుపుకని మొత్తం ఎన్నికల ప్రక్రియనే రద్దుచేసి మళ్ళీ ఎన్నికలను నిర్వహించాలని పార్టీల డిమాండ్ చేశాయి.

అయితే ఒకసారి ఏకగ్రీవమైనట్లు చేసిన ప్రకటనను రద్దుచేసే అవకాశం కోర్టులకు లేదని డివిజన్ బెంచ్ స్పష్టంగా చెప్పింది. అయితే ఇదేమీ పట్టించుకోకుండా రాజకీయపార్టీలు వేసిన పిటీషన్ను విచారించిన సింగిల్ బెంచ్ ఎన్నికలను రద్దు చేయాల్సిందే అంటు మళ్ళీ తీర్పిచ్చింది. దీనిపైనే ప్రభుత్వం మళ్ళీ డివిజన్ బెంచ్ లో కేసు వేసింది. అసలు ఎన్నికల నిర్వహణపై సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ కొట్టేయటమే కాకుండా ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డివిజన్ బెంచ్ తీర్పుతోనే ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించింది.

అయితే ఎన్నికలను నిర్వహించుకోమని చెప్పిన డివిజన్ బెంచ్ ఫలితాలను మాత్రం ప్రకటించవద్దన్నది. దీనివల్ల ఆపరేషన్ సక్సెస్ బట్ పేషంట్ డెడ్ అన్నట్లుగా తయారైంది. ఎన్నికలు అయిపోయాయి కానీ ఫలితాలు మాత్రం పెడింగ్ లోనే ఉండిపోయాయి. ఇపుడా రిజల్టు కోసమే పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఇంతలో ఎన్నికల రద్దుచేస్తు సింగిల్ బెంచ్ తీర్పు, దానిపై డివిజన్ బెంచ్ లో మళ్ళీ కేసు దాఖలైంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పరిషత్ ఎన్నికల తర్వాత జరిగిన మున్సిపల్, కొర్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఛైర్మన్లు, మేయర్లు బాధ్యతలు కూడా తీసుకున్నారు. కానీ పరిషత్ ఎన్నికల ఫలితాలు వరకు ఆగిపోయాయి. ఫలితాలు ఆపేసేకాడికి అసలు ఎన్నికల నిర్వహణే అవసరంలేదు. ఎన్నికలు నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోర్టు పలితాలను మాత్రం ప్రకటించవద్దని ఎందుకు ఆదేశించిందో అర్ధంకావటంలేదు. ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ఆపేయటంతో స్ధానికసంస్ధల ఉనికే ప్రశ్నార్ధకమవుతోంది. ఏకగ్రీవంగా ఎన్నికైన వారి పరిస్ధితి కూడా త్రిశంకుస్వర్గంలో పడిపోయింది. దీంతో పరిషత్ ఎన్నికల రిజల్టుకు మోక్షమెప్పుడా అని అధికారపార్టీ నేతలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.