Begin typing your search above and press return to search.
దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ ఛైర్మన్ జీతం.. సీనియర్ ఐటీ ఉద్యోగి కంటే ఇంత తక్కువా?
By: Tupaki Desk | 7 Jun 2022 3:29 AM GMTఆయన అలాంటి ఇలాంటి వ్యక్తి కాదు. ఆ మాటకు వస్తే.. ఆయన అపాయింట్ మెంట్ దొరకబుచ్చుకోవటం అంత తేలికైన విషయం కాదు. దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ఉద్యోగం అంటే మామూలు కాదు. ఆ పోస్టు కోసం ఎంతో మంది కోటి కళ్లతో ఎదురుచూస్తుంటారు.మరి.. అలాంటి భారీ పొజిషన్ కు వచ్చే జీతం ఎంతో తెలుసా? లెక్క తెలిస్తే నోట మాట రాకపోవటమే కాదు.. మైండ్ బ్లాక్ అయిపోద్ది. నిజానికి ఆయనకు వచ్చే జీతం కంటే పదేళ్లు అనుభవం ఉన్న సీనియర్ ఐటీ ఉద్యోగికి ఎక్కువ జీతం వస్తుందని చెప్పాలి.
తాజాగా వెల్లడైన అధికార పత్రాల పుణ్యమా అని ఆయన జీతం లెక్కలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఎస్ బీఐకు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు దినేశ్ కుమార్ ఖరా. ఆయన వార్షిక జీతం అక్షరాల రూ.38.12 లక్షలు మాత్రమే.అది కూడా అన్ని ప్రోత్సహాకాల్ని కలుపుకొని. అంటే.. నెలకు 3.2 లక్షల రూపాయిలు మాత్రమే. విన్నంతనే విస్మయానికి గురి చేసే ఈ లెక్క.. ఇప్పుడు అందరిని విస్తుపోయేలా చేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలసంగతి తర్వాత.. ఒక మోస్తరు కంపెనీల్లో పని చేసే ప్రాజెక్టు మేనేజర్లకు సైతం ఇంత కంటే భారీగా జీతాలు ఇస్తున్న పరిస్థితి.
ఎక్కడిదాకానో ఎందుకు.. హైదరాబాద్ మహానగరంలోని చాలా టవర్స్ లో నివాసం ఉండే అత్యధికులైన ఐటీ ఉద్యోగుల వార్షిక జీతం కూడా దినేశ్ కు వచ్చే జీతానికి రెట్టింపు.. అంతకంటే ఎక్కువ జీతాలు వచ్చే పరిస్థితి.
ఆ మాటకు వస్తే.. దేశీయంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకు అధిపతుల వేతనాలు అన్ని ఇదే స్థాయిలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏడాదికి ఏడాది లాభాల పంట పండించే ఎస్ బీఐ ఛైర్మన్ జీతానికి దగ్గరగా.. పెద్దగా ఆదాయం రాని ప్రభుత్వ రంగ బ్యాంకుల అధినేతలకు ఇదే స్థాయిలో జీతాలు ఉన్నాయి. ఇక.. అన్నింటికంటే దారుణమైన అంశం ఏమంటే.. ప్రైవేటు బ్యాంకుల అధినేతల వార్షిక జీతాలకు.. వీరికి ఏ మాత్రం పోలిక లేని పరిస్థితి.
తాజాగా విడుదలైన ఎస్ బీఐ వార్షిక నివేదికలో ఈ అంశం వెలుగు చూసింది. 2021 - 22 ఆర్థిక సంవత్సరానికి ఆయన బేసిక్ పే ద్వారా రూ.27లక్షలు పొందగా.. రూ.7.42 లక్షల్ని డీఏ రూపంలో అందుకున్నారు. ఇవి కాకుండా ఇతర ప్రోత్సహాల కింద మరో రూ.4లక్షలు అందాయి. అంటే.. ఏడాది మొత్తంగా ఆయన చేతికి అందింది కేవలం రూ.38.12లక్షలు మాత్రమే. ఎస్ బీఐ బోర్డులో ఉన్న నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లు కూడా అదే స్థాయిలో జీతాలు అందుకోవటం గమనార్హం.
మరోవైపు ప్రైవేటు రంగ బ్యాంకులైన హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ఎండీ కమ్ సీఈవో శశిధర్ జగదీశన్ కు ఏడాదికి రూ.4.77 కోట్లు.. యాక్సిస్ బ్యాంక్ ఎండీ అమితాబ్ చౌధిరి రూ.6 కోట్ల జీతాన్ని తీసుకున్నారు. ఇక.. ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ కమ్ సీఈవో సందీప్ భక్షి రూటు కాస్త సపరేటు. ప్రస్తుతం కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతాన్ని (గౌరవ వేతనం) తీసుకున్నారు. అత్యంత పవర్ ఫుల్ సీట్లలో కూర్చొని ఇంత తక్కువ జీతమా? అన్న ఆశ్చర్యం కలుగక మానదు.