Begin typing your search above and press return to search.
జోబైడెన్ కు గట్టి షాక్ ఇచ్చిన సౌదీ యువరాజు!
By: Tupaki Desk | 18 July 2022 10:30 AM GMTఅగ్రరాజ్యం అమెరికా తన పరపతిని..తన డాలర్ ను ప్రపంచవ్యాప్తం చేయడంలో గల్ఫ్ దేశాలు ఎంతో సహకరించాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పోయే పెట్రోల్, డీజిల్, చమురును 'డాలర్ల'లో గల్ఫ్ దేశాలు తీసుకునే విషయంలో అమెరికా విజయం సాధించింది. అయితే కాలక్రమంలో అమెరికా ఆధిపత్యానికి గండిపడుతోంది. చైనా ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. అమెరికా దిగజారుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సౌదీ అధికారిక పర్యటనలో అమెరికా అధ్యక్షుడికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది.
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సౌదీ అరేబియా పర్యటన ఆసక్తి రేపింది. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సుల్తాన్ , జోబైడెన్ మధ్య దెబ్బతిన్న సంబంధాలు పునరుద్దరించాలని యోచించారు.
ఇటీవల జోబైడెన్ సౌదీలో అడుగుపెట్టగానే ఆయనకు సౌదీ యువరాజు స్వాగతం పలికేందుకు ఎదురు వచ్చారు. ఇద్దరూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడానికి బదులు పిడికిళ్లతో టచ్ చేసుకున్నారు. రెండున్నర గంటల పాటు జోబైడెన్ తో యువరాజు భేటి జరిగింది.
ఇక సౌదీలో మానవహక్కులపై జోబైడెన్ ప్రస్తావించగా.. సౌదీ యువరాజు గట్టిగా బదులిచ్చినట్టు ఆదేశ విదేశాంగ మంత్రి తెలిపారు. మీరు బలవంతంగా ఎవరిపై అభిప్రాయాలు రుద్దలేరని.. మా విలువలు మాకు ఉంటాయని.. 100శాతం అమెరికా విలువలకు పోలి ఉండవు అంటూ జోబైడెన్ కు సౌదీ యువరాజు గట్టి బదులిచ్చినట్టు తెలిసింది.
సౌదీ రాజు సల్మాన్ అనారోగ్యంతో రేపో మాపో అన్నట్టుగా ఉన్నారు. దీంతో ఆయన కుమారుడు యువరాజు ఇప్పుడు సౌదీకి అనధికార రాజుగా వ్యవహరిస్తున్నారు.కానీ జోబైడెన్ అధ్యక్షుడయ్యాక ఈ యువరాజును గుర్తించలేదు. మాట్లాడేందుకు నిరాకరించారు. కేవలం సౌదీ రాజుతోనే మాట్లాడుతానని స్పష్టం చేశారు. ఇక అమెరికా జర్నలిస్ట్ ఖషోగ్జి హత్యకు సౌదీనే బాధ్యత అని విమర్శించడంతో సౌదీ-అమెరికా మధ్య దూరం పెరిగింది.
ఈ క్రమంలోనే అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడం.. మిడ్ టర్మ్ ఎన్నికల దృష్ట్యా పెట్రోల్ ధరలను నియంత్రించేందుకు సౌదీకి వచ్చాడు జోబైడెన్. కానీ ఆయన అనుకున్న విధంగా చమురు ఉత్పత్తి పెంచడానికి సౌదీ యువరాజు ఆసక్తి చూపలేదు. దీంతో జోబైడెన్ సౌదీ పర్యటన వృథా అయిపోయింది.