Begin typing your search above and press return to search.

బడి మంత్రి పేరు ఆ స్కూల్ లో తీసేశారుగా

By:  Tupaki Desk   |   25 Aug 2022 2:30 AM GMT
బడి మంత్రి పేరు ఆ స్కూల్ లో తీసేశారుగా
X
ఆయన సీనియర్ మోస్ట్ మంత్రి. అనేక శాఖలు చూసిన రాజకీయ యోధుడు. ప్రస్తుతం విద్యా శాఖను చూస్తున్నారు. ఆయనే బొత్స సత్యనారాయణ. మున్సిపల్ శాఖను చూసినప్పటి మాదిరిగా ఉత్సాహంగా ఆయన మీడియా ముందుకు ఇపుడు పెద్దగా రాలేకపోవచ్చు.

కానీ చెప్పాలీ అంటే ఏపీ నిండా ఆయన పేరే ప్రతీ శిలాఫలకం మీద ఉండే గొప్ప చాన్స్ విద్యా శాఖ ఇచ్చింది. ఎందుకంటే ఏపీలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయో వాటిని నాడు నేడు కింద పునర్మిస్తున్నారు. కొన్ని చోట్ల కొత్తగా కడుతున్నారు.

మరి అలా కనుక చూస్తే శిలాఫలం మీద బొత్స సత్యనారాయణ పేరు కచ్చితంగా ఉండాలి. అది ప్రోటోకాల్ ప్రకారం జరిగి తీరాల్సిందే. అయితే బొత్స సొంత జిల్లా పక్కన ఉన్న అనకాపల్లిలో మాత్రం 172 లక్షలలతో నిర్మిస్తున్న ఉన్నత పాఠశాల భవనానికి సంబంధించి శంకుస్థాపన శిలాఫలకం మీద బొత్స పేరుని ఎగరగొట్టేశారు. అంతే కాదు అనకాపల్లి జిల్లా మంత్రి గుడివాడ అమరనాధ్ పేరు అతి పెద్ద అక్షరాలతో రాయించేసి రాజ భక్తిని చాటుకున్నారు.

మరి దీని వెనక అధికారుల అతి ఉత్సాహం ఉందా లేక గుడివాడ కీర్తి కండూతి ఉందా అన్నది తెలియదు కానీ సీనియర్ మంత్రికి అలా అన్యాయం జరిగిపోయింది అంటున్నారు.

ఆయన సొంత పార్టీకి చెందిన వారు. విద్యా శాఖ చూస్తున్న వారు. మరి ఆయన పేరు లేకుండా శిలాఫలకం తయారు చేయించాలన్న ఆలోచన ఎవరికి వచ్చిందో కానీ సొంత పార్టీ వారికే ఇలా ప్రోటోకాల్ విషయంలో చుక్కలు చూపిస్తే ఇక బయట పార్టీల వారు మొర్రో అని ఏడుస్తున్నారు అంటే అర్ధం ఉందిగా.

ఇపుడు ఇదే విషయం హైలెట్ అవుతోంది. అంతే కాదు వైసీపీలోనే చర్చ సాగుతోంది. బొత్సకు సొంత పార్టీలోనే ఈ రకమైన మర్యాద ఇస్తే ఇక మిగిలిన వారి సంగతి అడగక్కరలేదు అని కూడా అంటున్నారు. ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా ప్రోటోకాల్ అన్నది ఒకటి ఉంటుంది. దాని ప్రకారం అందరి పేర్లూ ఉండాల్సిందే. మరి దీని మీద బడి మంత్రి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.