Begin typing your search above and press return to search.

ఐసీయూలో మరణమృదంగం .. 663 మందిలో 441 మంది కన్నుమూత

By:  Tupaki Desk   |   18 May 2021 9:30 AM GMT
ఐసీయూలో మరణమృదంగం .. 663 మందిలో 441 మంది కన్నుమూత
X
భారత్ లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో నమోదు అయ్యే కరోనా కేసులు లక్షల్లో నమోదు అవుతున్నాయి. అలాగే మరణాలు కూడా ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇక దేశంలో ఎక్కువగా కరోనా కేసులు నమోదు అయ్యే రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఒకటి. కర్ణాటక లో ప్రతి రోజు కూడా ముప్పై వేలకి పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇక బెంగుళూరు జిల్లా కోవిడ్‌ ఆస్పత్రి ఐసీయూలో కొన్నినెలలుగా కరోనా చికిత్స పొందిన 663 మందిలో 441 మంది కన్నుమూశారు. కోలుకుని 222 మంది మాత్రమే బతికి బయటపడ్డారు. మరణాల శాతం చాలా ఎక్కువగా ఉండడంతో ఐసీయూలో చేరిన రోగుల బంధువులు ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని హడలిపోతున్నారు. ఐసీయూలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రాణనష్టం సంభవిస్తోందని ఆరోపణలున్నాయి. ఈ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని డిమాండ్‌ చేశారు.

భారత్‌ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొన్ని రోజులుగా కొత్త కేసుల్లో తగ్గుముఖం కనిపిస్తోంది. మూడు లక్షలకు దిగువన కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులు తగ్గినా, కరోనా మరణాల సంఖ్య మాత్రం తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 2,63,533 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒకే రోజు 4,329 మంది మృత్యువాతపడ్డారు. సోమవారం 4,22,436 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్రవైద్యారోగ్యశాఖ మంగళవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం మొత్తం 2,52,28,996 మంది కరోనా బారినపడ్డారు. దేశంలో కరోనాతో ఇప్పటివరకు 2,78,719 మంది మృతిచెందారు. 2,15,96,512 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 33,53,765 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 18.44 కోట్ల వ్యాక్సినేషన్‌ పూర్తయ్యింది. గత 24 గంటల్లో 18,69,223 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు 31,82,92,881 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.