Begin typing your search above and press return to search.

సీక్రెట్ అంటే సీక్రెటే మరి....నాదెండ్ల టాక్స్...టీడీపీకి జోష్

By:  Tupaki Desk   |   19 Nov 2022 3:47 AM GMT
సీక్రెట్ అంటే సీక్రెటే మరి....నాదెండ్ల టాక్స్...టీడీపీకి జోష్
X
సీక్రెట్ అంటే సీక్రెటే. దాని కంటేంటే అది. వన్స్ అది ఓపెన్ అయితే సీక్రెట్ కి అర్ధం ఏముంటుంది. ఇదే మాటను చాలా నేర్పుగా జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ చెప్పారు. విశాఖలో మోడీతో పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడారు అన్నది ఎవరికీ తెలియదు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఇద్దరే. వన్ టూ వన్ గా ఈ మీటింగ్ సాగింది.

మోడీ ఆ వివరాలు రివీల్ చేసే సీనే ఉండదు, ఇక చెబితే పవన్ కళ్యాణ్ చెపాలి. దాని మీద నాదెండ్ల లేటెస్ట్ గా మాట్లాడుతూ ఒక్కటే అన్నారు. ప్రధానమంత్రితో పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడారు అన్నది మేము ఎప్పటికీ రహస్యంగానే ఉంచుతాం. ఆ విషయాన్ని ఎవరితో పంచుకోమని చెప్పారు.

ఇక సోషల్ మీడియాలో పవన్ తో మోడీ అలా చెప్పారు, ఇలా అన్నారు అలా డైరెక్షన్ ఇచ్చారు అని వస్తున్న వార్తల పట్ల ఆయన స్పందించారు. అవన్నీ ఊహాగానాలూ పుకార్లే సుమా వాటిని అసలు ఎవరూ నమ్మవద్దు అంటూ కుండబద్ధలు కొట్టారు.

ఏపీని వైసీపీ విముక్త రాష్ట్రంగా ఏపీని చేసే విషయంలో తాము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని కూడా నాదెండ్ల చెప్పడమే బిగ్ ట్విస్ట్. పైగా పొత్తులు అన్నవి ఎన్నికల ముందు చర్చించాల్సిన అంశాలని, వాటిని ఇపుడు మాట్లాడం తగదని ఆయన చెప్పడం ద్వారా టీడీపీ పొత్తుల ఆశలను సజీవంగా ఉంచారు.

మొత్తానికి బీజేపీలోని ఒక వైసీపీ ప్రో వర్గం. అలాగే వైసీపీలోని ఆరాటాల బ్యాచ్ ఇలా చాలా మంది ఉత్సాహపడుతూ టీడీపీ జనసేన పొత్తు లేకుండా పోయింది అంటూ చేస్తున్న హడావుడికి చెక్ పెట్టేశారు నాదెండ్ల. అలాగే టీడీపీతో పొత్తులు ఉంటాయన్నట్లుగా హింట్ కూడా ఇచ్చారు అనుకోవాలి.

మరో వైపు చూస్తే వైసీపీ నుంచి ఏపీని విముక్తం చేస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పడం ద్వారా నాదెండ్ల టీడీపీతో పొత్తులు ఉన్నాయని చెప్పారని అంటున్న వారూ ఉన్నారు. అలాగే ఎన్నికల వేళకు పొత్తుల సంగతి మాట్లాడుకోవచ్చు అని ఆయన అనడం బట్టి ఆలోచించినా బీజేపీని కూడా చివరికి తమ వైపునకు లాగగలమన్న అశ ఎక్కడో ఉంది అని కూడా అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే పవన్ మోడీ భేటీ టాప్ సీక్రెట్ అని అది ఎవరితో పంచుకోమని చెబుతున్న నాదెండ్లకు ఆ భేటీ వివరాలు తెలిశాయా అన్న వారూ ఉన్నారు. ఒక వేళ పవన్ కనుక నాదెండ్లకు ఆ విషయం చెబితే అది మూడవ వ్యక్తికి చేరినట్లే కదా అపుడు సీక్రెట్ ఎలా అవుతుంది అన్న చర్చ కూడా వస్తోంది. మొత్తానికి మోడీ పవన్ భేటీ కాదు కానీ ఏం జరిగింది అన్న దాని మీద కధలు కధనాలు ఇంకా సాగిపోతాయా లేక ఆగుతాయా అన్నది మాత్రం ఎవరూ చెప్పలేరనే అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.