Begin typing your search above and press return to search.
బ్రిటీషోళ్లను భయపెట్టిన ‘‘చపాతీ’’
By: Tupaki Desk | 25 Jun 2016 1:54 PM GMTఅవును.. గుండ్రంగా ఉండే చపాతీలు బ్రీటీషోడ్ని భయపెట్టాయి. ముచ్చెమటలు పోయించేలా చేశాయి. ఏం జరుగుతుందో అర్థం కాక కిందామీదా పడిపోవటమే కాదు.. దీని వెనుకున్న గూడార్థం అర్థంకాక సతమతమయ్యే పరిస్థితి. చరిత్రలో రికార్డు అయినా.. పెద్దగా ప్రాచుర్యంలోకి రాని ఈ చపాతీ ఉద్యమం గురించిన వివరాలు తెలిసినప్పుడు ఆశ్చర్యపోవాల్సిందే. నాడు దేశాన్ని పాలించిన తెల్లోడికి చపాతీలు అంతగా వణుకు పుట్టించాయా? అనిపించక మానదు.
ఎంత కొట్టుకున్నా అర్థం కాని పజిల్ గా మారిన చపాతీ ఉద్యమంలోకి వెళితే..
అది..1857. ఈస్టిండియా కంపెనీ భారతీయుల్ని బానిసలుగా చేసుకొని పాలిస్తున్న రోజులు. తమ పాలన పట్ల భారతీయులు పూర్తిస్థాయి అసంతృప్తితో ఉన్నారని.. తమను ఏదో రకంగా దెబ్బ తీస్తారన్న ఆలోచనతో.. దేశం మొత్తం డేగ కన్నేసుకొని ఉన్న రోజులవి. అలాంటి రోజుల్లో ఈస్టిండియా కంపెనీలో మిలటరీ వైద్యుడిగా పని చేస్తున్న డాక్టర్ గిల్బర్ట్ హాడో బ్రిటన్ లోని తన సోదరికి ఒక లేఖ రాశారు. అందులో.. తాను అంతుచిక్కని ఒక పరిస్థితిలో ఉన్నానని పేర్కొన్నారు. ఆయన రాసిన లేఖలో ఏముందంటే..
‘‘ఇక్కడేదో జరుగుతోంది. కానీ.. అదేంటో ఎవరికీ అంతుపట్టటం లేదు. భారతదేశం మొత్తమ్మీదా ఇదే జరుగుతోంది. ఇది రహస్య ఉద్యమమా? మరింకేమైనదా అన్నది అర్థం కావటం లేదు. ఎవరు.. ఎక్కడ.. ఎందుకు.. మొదలు పెట్టారో అర్థం కావటం లేదు. భారతీయ పత్రికల్లో కూడా దీని మీద పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాని పేరు చపాతి ఉద్యమం. ఇందులో భాగంగా చపాతీలను తయారు చేసి ఒకరికొకరు పంచుకుంటారు. ఇది దక్షిణాది నుంచి ఉత్తరాది వరకూ సాగుతోంది. మొత్తం భారత దేశం మొత్తం సాగుతోంది. ఇదెంత వేగంగా సాగుతుందంటే.. ఒక్కరాత్రిలో దాదాపు 300 కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తున్నాయి. ఇది బ్రిటీష్ వారి పోస్టల్ సిస్టం కంటే వేగంగా ఉంది’’ అంటూ చెప్పుకొచ్చాడట.
నిజానికి ఈ సందేహం ఒక్క ఈ డాక్టర్ కు మాత్రమే కాదు.. ఈస్టిండియా కంపెనీకి చెందిన ఎంతో మందిని ఇదే వెంటాడింది. ఎవరో ఎక్కడి నుంచో రావటం. వారి చేతుల్లో చపాతీలు పెట్టటం.. మరికొన్ని చపాతీలు పెట్టి.. పక్క వారికి పంచాలని చెప్పటం ఈ ఉద్యమంలోని కీలకాంశం. ఇలా మొదలైన చపాతీ ఉద్యమం ఊళ్లకు ఊళ్లు దాటి రాష్ట్రాలు కూడా దాటిపోయిన పరిస్థితి. తెల్లోడిని అంతగా ఇబ్బంది పెట్టి.. వారి కంటి నిండా కునుకు లేకుండా చేసిన ఈ చపాతీ ఉద్యమం ఉద్దేశాన్ని తెలుసుకునేందుకు వారు ఏడాది పాటు ప్రయత్నించారు. కానీ.. ఫలితం శూన్యం. చపాతీల మీద ఏదైనా రహస్య సంకేతాలు ఉన్నాయా? అంటే.. అదీ కనిపించని.
ఎలాంటి కారణం లేకుండా ఈ చపాతీల బట్వాడా ఎందుకు జరుగుతుందన్న విషయాన్ని తెల్లోడు తేల్చలేకపోయాడు. ఈ ఇష్యూ లెక్క తేల్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఏడాది పాటు సాగిన ఈ ఉద్యం తర్వాతి కాలంలో చల్లబడింది. ఎందుకిలా? అనేదానికి చరిత్రకారులు చెప్పేదేమంటే.. కలరా వ్యాప్తి చెందిన రోజుల్లో బలవర్థమైన ఆహారాన్ని అందించటానికి వీలుగా చపాతీలు పంచమని చెప్పి ఉంటారని చెబుతారు. ఏమైనా చరిత్రలో ఈ చపాతీ ఉద్యమం తెల్లోడిని చాలానే వణికించిందనే చెప్పాలి.