Begin typing your search above and press return to search.
విజేతల విజయరహస్యం ఇదీ..
By: Tupaki Desk | 14 Dec 2019 5:34 AM GMTప్రపంచంలో కొందరే ఎందుకు విజేతలుగా నిలుస్తున్నారు.. వారి విజయ రహస్యం ఏంటి? మనమెందుకు విజేతలుగా నిలవడం లేదు.. ప్రపంచ యవనికపై కనిపించడం లేదు.? ఈ ప్రశ్నలు అందరికీ జీవితంలో ఒక్కసారైనా వస్తాయి.. కానీ విజేతలుగా నిలవడానికి ప్రధాన కారణాన్ని ఆస్ట్రేలియాలోని సిడ్నీ వర్సిటీ శాస్త్రవేత్తలు కనిపెట్టారు.
భారత మాజీ కెప్టెన్ విజయవంతమైన మహేంద్ర సింగ్ ధోని ఆ మధ్య తన జీవిత చరిత్రపై తీసిన ‘ఎంఎస్ ధోని’ మూవీ ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఈ ఫంక్షన్ కు హాజరై ధోని గురించి ఓ మాట చెప్పారు. ‘కర్మ యోగి ధోని’ అని ఆయనంటే నాకు స్ఫూర్తి అని కొనియాడారు.. ఎంతటి ఒత్తిడి, సమస్యలు ఎదురైనా చెక్కుచెదరని ధోనిని చూస్తే నాకు స్ఫూర్తి కలుగుతుందన్నారు. ప్రపంచకప్ ఫైనల్ చివరి బాల్ అయినా ధోనిలో ఎలాంటి భయం, బెరుకు, ఒత్తిడి లేదని..అంతటి ఒత్తిడిని తాను కూడా తట్టుకోలేనని.. అందుకే ధోని కర్మ యోగి అంటూ మెచ్చుకున్నారు.
కర్మ యోగి అంటే ఎలాంటి వాటికి చలించని గొప్ప మనసత్త్వం గల వారు అని అర్థం. అలాంటి కర్మయోగులే విజేతలుగా నిలుస్తారని సిడ్పీ పరిశోధకులు తేల్చారు. దాదాపు 27 దేశాల్లోని 42వేల మంది విద్యార్థులపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు దాదాపు 160 అధ్యయన నివేదికలు రూపొందించి విశ్లేషించారు.
ఇందులో ఆందోళన, విసుగు, అసంతృప్తి వంటి ప్రతికూల సందర్భాలు ఎదురైనప్పుడు కూడా భావోద్వేగాలను అదుపులో పెట్టుకునే నైపుణ్యం కలిగిన విద్యార్థులు చదువుల్లో దూసుకుపోతున్నట్లు గుర్తించారు. విజేతల విజయరహస్యం చూడా భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడమే అని తేల్చారు. భావోద్వేగాలను నియంత్రణలోకి ఉంచుకున్న వారే ప్రపంచంలో విజేతలయ్యారని తేల్చారు. సో మీరు విజేతలుగా కాలేదంటే మీలో ఈ లోపాలు ఉన్నట్టే లెక్క. వాటిని సవరించుకుంటే మీరు విజేతలు కావచ్చు.