Begin typing your search above and press return to search.
ఇండియాలో ఫస్ట్రేషన్.. నెట్ ఫ్లిక్స్ సీఈవో సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 22 Jan 2022 8:34 AM GMTకరోనా కల్లోలంలో ఇప్పుడు ‘ఓటీటీ’నే థియేటర్ల కొరతను తీర్చి ప్రతి ఒక్కరికి సినిమాను చేరువ చేస్తోంది. ఓటీటీ మార్కెట్ కు విశ్వవ్యాప్తంగా క్రేజ్ తీసుకొచ్చింది ‘నెట్ ఫ్లిక్స్’ సంస్థనే. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సినిమాలు, మంచి సీరియల్స్ తో దున్నేస్తున్న నెట్ ఫ్లిక్స్ కు ఇండియన్ మార్కెట్ మాత్రం ఎంతకీ కొరుకుడు పడడం లేదు.
ఇండియా, ఇక్కడి ప్రజల అభిరుచులు నెట్ ఫ్లిక్స్ వ్యవస్థాపకులను ఫస్ట్రేషన్ కు గురిచేస్తున్నాయి. నెట్ ప్లిక్స్ సంస్థ 2021 ఏడాదికి సంబంధించి చివరి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ ఫౌండర్, కోసీఈవో రీడ్ హ్యాస్టింగ్స్ మాట్లాడుతూ ఇండియన్ మార్కెట్ ఫస్ట్రేటింగ్ గా ఉందన్నారు. మా కంపెనీ ఇక్కడే మరికొన్ని విషయాలు నేర్చుకునేది ఉదంటూ పేర్కొన్నారు. నెట్ ఫ్లిక్స్ సీఈవో ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ప్రపంచ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ 2015లో భారత మార్కెట్ లోకి భారీ ఎత్తున ప్రవేశించింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ అతి తక్కువు చందాదారులు చేసిన ఏడాదిగా 2021 నిలిచింది. కొత్త చందాదారుల సంఖ్య భారీగా పడిపోయింది. దీంతో 2022 ఏడాదికి మొదటి మూడు నెలలు నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని నెట్ ఫ్లిక్స్ కుదించింది.
ప్రస్తుతం త్రైమాసికంలో 4 మిలియన్ల కొత్త చందాదారులకు లక్ష్యంగా పెట్టుకున్న నెట్ ఫ్లెక్స్ కు ఇప్పుడు అది 2.5 మిలియన్లకు పడిపోయింది.
ఇండియాలో ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ 206 మిలియన్ డాలర్లుగా ఉంది. 2026 నాటికి ఇది ఏకంగా 226 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.. దీంతో మిగిలిన ఓటీటీ కంపెనీలు ఇండియన్ మార్కెట్ పై కన్నేశాయి.
మార్కెట్ అంచనాల ప్రకారం.. ఇప్పటికే డిస్నీ +హాట్ స్టార్ 36 మిలియన్ చందాదారులతో అగ్రస్థానంలో ఉంది. అమెజాన్ ప్రైమ్ 17 మిలియన్ చందాదారులతో రెండో స్థానంలో ఉంది. ఇక నెట్ ఫ్లిక్స్ 4.5 నుంచి 5 మిలియన్లకే పరిమితమైంది. ఈ తరుణంలో కొత్త చందాదారుల సంఖ్య గణనీయంగా పడిపోవడం నెట్ ఫ్లిక్స్ కు మింగుడు పడడం లేదు.
కంటెంట్ కోసం 3వేల కోట్ల పెట్టుబడి పెట్టినా వినియోగదారులను ఆకట్టుకోలేకపోవడానికి కారణం నెట్ ఫ్లిక్స్ నెలవారీ చందా ఎక్కువగా ఉండడమేనని మార్కెట్ నిపుణులు అంటున్నారు. నెట్ ఫ్లిక్స్ నెలావారీ బడ్జెట్ ప్లాన్స్ కే మిగిలిన ఓటీటీలు ఏడాది చందా ఇస్తున్నాయని చెబుతున్నారు.