Begin typing your search above and press return to search.

షాక్.. దర్యాప్తు పేరుతో తల్లీ కూతుళ్లను అలా చేసిన ఎస్ఐ

By:  Tupaki Desk   |   18 Feb 2020 6:00 AM GMT
షాక్.. దర్యాప్తు పేరుతో తల్లీ కూతుళ్లను అలా చేసిన ఎస్ఐ
X
షాకింగ్ ఉదంతం ఒకటి వెలుగు చూసింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ జోన్ పరిధిలో పని చేసిన ఒక ఎస్ఐ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాధితురాలి ఫిర్యాదును పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు సైతం విస్మయానికి గురైన ఈ ఉదంతంలోకి వెళితే.. తనకున్న సమస్య నేపథ్యం లో కొన్నేళ్ల క్రితం ఒక వివాహిత మాదాపూర్ జోన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ కు వచ్చింది. తన సమస్యకు సంబంధించిన ఫిర్యాదును అక్కడి ఎస్ఐ కి ఇచ్చింది. అలా ఆమెతో మొదలైన పరిచయం పెరిగింది.

కేసు విచారణలో భాగంగా అతగాడి దూకుడుతో ఆ కుటుంబం మరింత దగ్గరైంది. కేసు దర్యాప్తు లో భాగంగా ఇంటికి వస్తున్నాడని అక్కడి వారు భావించారు. బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. ఇలాంటివేళ.. ఊహించని నిజం ఒకటి బయటకు వచ్చింది. బాధితురాలి తల్లితో సదరు ఎస్ఐకు వివాహేతర సంబంధం ఉందన్న విషయాన్ని గుర్తించారు. ఆ విషయాన్ని బాధితురాలే గుర్తించింది.

ఈ ఎపిసోడ్లో మరో కీలకాంశం ఏమంటే.. విడతల వారీగా రూ.5లక్షల మొత్తాన్ని తీసుకోవటం. దీంతో.. తమకు జరిగిన అన్యాయంపై సదరు మహిళ సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి.. వారికి ఫిర్యాదు చేసింది. ఈ మొత్తం ఉదంతం గురించి విన్న వారంతా అవాక్కు అవుతున్నారు. తనకు ఎదురైన మోసం గురించి పోలీసులకు కంప్లైంట్ చేస్తున్నా.. తనకున్న పలుకుబడితో సదరు ఎస్ఐ తొక్కి పెడుతున్నట్లుగా బాధిత మహిళ ఆరోపిస్తోంది. ఏమైనా.. ఇలా తల్లీకూతుళ్ల విషయంలో వ్యవహరించిన తీరు నేపథ్యంలో అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. మరో అంశం ఏమంటే.. గడిచిన కొంత కాలంగా సదరు ఎస్ఐ విధులకు సరిగా రావటం లేదన్న విషయాన్ని గుర్తించారు.