Begin typing your search above and press return to search.

ఐటీ సిటీ బెంగళూరులో పరిస్థితి దయనీయం.. కోట్ల నష్టం

By:  Tupaki Desk   |   6 Sep 2022 8:30 AM GMT
ఐటీ సిటీ బెంగళూరులో పరిస్థితి దయనీయం.. కోట్ల నష్టం
X
ఐటీ సిటీ బెంగళూరు ఎప్పుడూ ఆహ్లాదంగా.. ప్రశాంతంగా ఉండే నగరం.. ఐటీ కంపెనీలు, ఉద్యోగులతో భారత సిలికాన్ వ్యాలీ కలకల లాడేది. కానీ ఇప్పుడు బెంగళూరుపై కురిసిన భారీ వర్షాలు.. వాటి నుంచి వచ్చిన వరదలు ఆ నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఆఫీసులు, ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

భారీ వరదల కారణంగా మూడు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇళ్లలోకి వచ్చిన నీరు ఎటూ వెళ్లలేక ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో బయటకు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవాలన్నా ఇబ్బంది గా మారింది. సరైన ఆహారం, మంచినీళ్లు లేక ప్రజలు అల్లాడుతున్నారు.

రహదారులపై పొంగిపోర్లుతున్న వరదలతో వాహనదారులు అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో వరదనీరు భారీగా చేరింది. వరదల ధాటికి రెండు రోజులుగా ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రింగ్ రోడ్డు ప్రాంతాలు స్విమ్మింగ్ ఫూల్స్ ను తలపిస్తున్నాయి.

సాఫ్ట్ వేర్ ఏరియాలైన వైట్ ఫీల్డ్, మహదేవపుర, బొమ్మనహల్లి ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. రెండు రోజులుగా వరదనీటిలోనే మగ్గుతున్నాయి. మారతహల్లి, సిల్క్ బోర్డు, ఎలక్ట్రానిక్ సిటీ, ఐటీపీఎల్ తో పాటు రింగ్ రోడ్డు లో ఉన్న ఐటీ కంపెనీలన్నీ నీట మునగడంతో ఉద్యోగులు ఇక్కట్లు పడుతున్నారు. ట్రాక్టర్లపై ఆఫీసుకు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వెళుతున్నారు. రోడ్లన్నీ జలమయం అవడం.. అపార్ట్ మెంట్ల సెల్లార్ లో వాహనాలు నీట మునగడంతో కొందరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమ తమ కార్యాలయాలను చేరుకునేందుకు ట్రాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నారు. రూ.50 తీసుకొని ఐటీ ఉద్యోగులను ట్రాక్టర్లలో ఆఫీసుల వద్ద డ్రాప్ చేస్తున్నారు.

బెంగళూరు రెయిన్ బో లేఅవుట్ లతోపాటు , వందల సంఖ్యలో గేటెడ్ కమ్యూనిటీలు చెరువులను తలపిస్తున్నాయి. వరదలతో ఇక్కట్లు పడుతున్న కాలనీవాసులను ట్రాక్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. వరదలతో ఇక్కట్లు పడుతున్న కాలనీవాసులను ట్రాక్టర్లలో సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నాయి.

బెంగళూరు మునిగిందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడంతో దానిపై నెటిజన్లు మండిపడుతూ కౌంటర్ ఇస్తున్నారు. ఇలా దెప్పిపొడవడం కరెక్ట్ కాదంటూ పలువురు హితవు పలుకుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.