Begin typing your search above and press return to search.
ఆడజన్మకు ఎన్ని శోకాలో.. ఆఫ్ఘనిస్తాన్ లో స్త్రీల పరిస్థితి ధైన్యం
By: Tupaki Desk | 20 Sep 2020 1:30 AM GMTచాలా ఏళ్ల క్రితం దళపతి అనే ఓ చిత్రంలో ‘ఆడజన్మకు ఎన్ని శోకాలో’ అంటూ ఓ పాట వచ్చింది. బహుశా ఆ పాటవిని కన్నీరు పెట్టని వారుండరేమో.. నిజంగా ఏ దేశంలోనైనా స్త్రీలపైన దారుణమైన అణచివేత ఉంటుంది. శారీరకంగా, మానసికంగా, లైంగికంగా వారిపై దాష్టికాలు సాగుతుంటాయి. అయితే మన పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్ లో స్త్రీల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఆ దేశంలో అసలు ఆడవాళ్ల ఉనికే ప్రశ్నార్థకమైంది. వాళ్ల పేరు ఎక్కడా వినిపించకూడదని ఆ దేశ రాజ్యాంగమే చెబుతున్నది. ప్రభుత్వం మంజూరు చేసే ఏ ధ్రువపత్రాలైన.. చివరకు మరణ ధ్రువపత్రాల్లో కూడా మహిళల పేరు ఉండకూడదని అక్కడి చట్టంలో ఉన్నది. ఓక స్త్రీ ఆ దేశంలో బతకాలంటే ఫలానా వాడి కూతురుగానో, ఫలానావాడి తల్లిగానో బతాకాల్సిందే. నేరుగా ఆమెపేరుతో బతకడానికి, చివరకు చావడానికి కూడా వీల్లేదు ఇలా రాసుకున్నారు అక్కడి రాజ్యాంగం. ప్రపంచం ఇంత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా అక్కడి పరిస్థితి అలా ఉందంటే ఇక ఆ దేశంలో మహిళలు ఎంత ధైన్యంగా బతుకుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆఫ్గాన్‌లో ఆడవారి పేరు వెల్లడించవద్దు. వివాహం చేస్తే ఆహ్వాన పత్రికలో వరుడి పేరు ఉంటుంది గానీ వధువు పేరు ఉండదు. డెత్సర్టిఫికెట్లోనూ వారి పేరు ఉండదు. సమాధులపై కూడా పేరు రాయరు. ఇదేంటని ఎవరూ ప్రశ్నించేందుకు సాహసించరు. తరతరాలుగా అలా అణచివేతలో బతికేస్తున్నారంతే.
అణచివేతకు ఇదో ఉదాహరణ..
పశ్చిమ అఫ్గానిస్తాన్‌కు చెందిన రెబియా అనే మహిళ జబ్బు పడటంతో ఆమెను భర్త డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు.
‘నీ పేరేమిటమ్మా’ అని అడిగాడు డాక్టర్ ఆమె రెబియా అని చెప్పింది. అతను మందుల చీటీపై ఆమె పేరు రాశాడు. చలి జ్వరంతో బాధపడే రెబియాకు టెస్ట్ లు చేసిన డాక్టర్ కొన్ని రోజులకు కోవిడ్-19 సోకినట్లు డాక్టర్ నిర్ధారించారు. కాగా జ్వరం, వొళ్లు నొప్పులతో బాధపడుతూ ఇంటికి వచ్చిన రెబియా.. డాక్టర్ ఇచ్చిన మందుల చీటీ భర్తకు ఇచ్చి మందులు తీసుకురమ్మని చెప్పింది. మందుల చీటీ మీద రెబియా పేరు చూసిన వెంటనే భర్తకు విపరీతమైన కోపం వచ్చింది. పేరు చెప్పినందుకు ఆమెను చిత్రవద చేశాడు ఆ భర్త. అక్కడి స్త్రీల పరిస్థితికి ఇదో ఉదాహరణ. దీంతో ఆఫ్ఘాన్‌లో కొంతకాలంగా ‘వేర్ ఈజ్ మై నేమ్?’ అనే పేరుతో ఉద్యమం నడుస్తోంది. ఈ ఉద్యమానికి సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున మద్దతు వస్తున్నది.
ఇలా ప్రశ్నించే మహిళలూ ఉన్నారు..
హెరాత్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ మాట్లాడుతూ. ‘అసలు నా పేరు ఎందుకు చెప్పాలి, నా కుటుంబానికి ఎందుకు అగౌరవం తీసుకురావాలి. ఇదంతా అనవసర రాద్ధాంతం. పేరు చెబితే వచ్చే ఉపయోగం ఏమిటి? ఓ తండ్రికి కూతురుగా, ఓ సోదరుడికి చెల్లెలుగా, ఓ భర్తకు భార్యగా బతికితే మన దర్జా ఏమన్నా తగ్గుతుందా’ అంటూ ప్రశ్నించారు ఓ మహిళ.
మరో మహిళ ధీన గాథ ఇది..
ఫరీదా సాదాత్ అనే ఆఫ్ఘనిస్థాన్ మహిళ కు 15 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే వివాహం అయ్యింది. పెళ్లైన కొంతకాలానికే ఆమెను భర్త వదిలేశాడు. అప్పటికే ఆమె గర్భం దాల్చడంతో ఓ కుమారుడికి జన్మనిచ్చింది. అయితే ప్రస్తుతం ఆ మహిళ తన కుమారుడికి చెందిన అన్ని ధ్రువపత్రాల్లో తండ్రి పేరే ఉంది. తల్లి పేరు పెట్టుకోవడానికి వీల్లేదని అక్కడి చట్టాలు చెబుతున్నాయి. ఫరీదా ఏమంటారంటే.. ‘ నన్ను ఏన్నో ఏండ్ల క్రితం నా భర్త వదిలేశాడు. ఆ తర్వాత అతడు మరో యువతిని పెళ్లిచేసుకున్నాడు. పిల్లలను కన్నాడు. నా కుమారుడిని ఏనాడు పట్టించుకోలేదు. తన ఆస్తిని కూడా మాకు ఇవ్వలేదు. అటువంటప్పడు అతడు నా కుమారుడికి తండ్రిగా ఎందుకు చలామణి కావాలి’ అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. ఫరీదా లాంటి ఎందరో మహిళలు ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి చట్టంలో మార్పులు తీసుకురావాలని కోరుతున్నారు.