Begin typing your search above and press return to search.

ఎల్జీ పాలిమర్స్‌ .. మాకేం సంబంధం లేదన్న దక్షిణ కొరియా బృందం !

By:  Tupaki Desk   |   23 Jun 2020 1:00 PM GMT
ఎల్జీ పాలిమర్స్‌ .. మాకేం సంబంధం లేదన్న దక్షిణ కొరియా బృందం !
X
ఏపీలో వైరస్ కేసులు పెరిగిపోతున్న సమయంలో ..విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ ఘటన ఒక్కసారిగా దేశం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఒక చిన్న తప్పిదం వల్ల కొందరు ప్రాణాలు కోల్పోతే ..ఆ కంపెనీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అయితే ,వెంటనే ఈ ఘటన పై ప్రభుత్వం స్పందించి భాదితులని ఆదుకుంది.

తాజాగా ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై దక్షిణ కొరియాకు చెందిన ఎనిమిది మంది ప్రతినిధులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ పేరుతో తమను కొరియాకి వెళ్లకుండా ఇక్కడే ఆపేశారని దక్షిణ కొరియా వెళ్లేందుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎల్జీ సంస్థకు వీళ్లకు ఎలాంటి సంబంధం లేదని సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు కావడం వల్ల విశాఖ వచ్చారని వాళ్ల తరపు న్యాయవాది వాదించారు.

ఇక వివరాలు సేకరించేందుకే దక్షిణ కొరియా బృందానికి పోలీసులు నోటీసులిచ్చినట్లు ఏజీ శ్రీరాం హైకోర్టుకు తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన పై భవిష్యత్తులో విచారణ కోసం అవసరమైతే మళ్లీ రావాల్సి ఉంటుందని ఏజీ తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసుల అభ్యర్థన మేరకు వారు రాకపోతే హైకోర్టులో పిటిషన్‌ వేయవచ్చని సూచించి తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.