Begin typing your search above and press return to search.

ఏపీలో కొత్త వైరస్ "ఎన్‌440కే" వ్యాప్తిపై నిర్ధారణ జరగలేదు !

By:  Tupaki Desk   |   6 May 2021 10:53 AM GMT
ఏపీలో కొత్త వైరస్ ఎన్‌440కే  వ్యాప్తిపై నిర్ధారణ జరగలేదు !
X
ఏపీలో కరోనా మహమ్మారి జోరు రోజురోజుకి పెరిగిపోతుంది. ప్రతి రోజు నమోదు అయ్యే కేసుల సంఖ్య మళ్లీ ఇరవై వేలు దాటింది. దీనితో రాష్ట్రంలో మళ్లీ ఆందోళన మొదలైంది. అయితే , కరోనా కట్టడి కోసం ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతుంది. తాజాగా పగటి పూట కూడా కర్ఫ్యూను అమల్లోకి తీసుకువచ్చింది. అయితే , ఏపీలో సెకండ్ వేవ్ లో కరోనా కొత్త వైరస్ ఎన్440కే వేరియంట్ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది అని , అందుకే రాష్ట్రంలో ఎక్కువగా కేసులు , అలాగే ఎక్కువ మరణాలు చోటు చేసుకుంటున్నాయి అంటూ ఓ వార్త సోషల్ మీడియా లో ప్రచారం అవుతుంది. ఈ ఎన్440కే వైరస్ మాములు వైరస్ కంటే పది రేట్లు వేగంగా విస్తరిస్తుంది అని అంటున్నారు. దీనితో ప్రజల్లో భయం పెరిగిపోతుంది.

ఈ నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చారు రాష్ట్ర కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్‌ కేఎస్‌ జవహర్ రెడ్డి అన్నారు. ఎన్‌440కే వైరస్‌ పై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో ఈ వైరస్‌ తీవ్రంగా ఉన్నట్టు ఎలాంటి నిర్థారణ జరగలేదని.. అందుకు సంబంధించిన పరిశోధన డేటా కూడా ఏమీలేదని ఆయన వెల్లడించారు. ప్రతీ నెలా సీపీఎంబీకి 250 నమూనాలు పంపుతాం. ఏపీ, తెలంగాణ, కర్ణాటకల నుండి నమూనాలను జన్యు శ్రేణి పరీక్షల కోసం సీసీఎంబీ హైదరాబాద్‌ కి పంపిస్తున్నారు. ఎన్ 440కె (బి.1.36) వైరస్ దక్షిణ భారత దేశం నుండి వెళ్లిన నమూనాల్లో గుర్తించారు. 2020 జున్‌, జూలై నెలల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక నుంచి వెళ్లిన నమూనాల్లో గుర్తించారు. దాని ప్రభావం గత డిసెంబర్, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కనిపించింది. కానీ మార్చి నెలలో అది పూర్తిగా అంతర్థానమైంది, ఇప్పుడు దాని ప్రభావం చాలా స్వల్పంగా ఉంది అని అన్నారు. ఎన్ 440కే వేరియంట్ కోసం డబ్ల్యూహెచ్‌ వో ఎక్కడా ప్రస్తావించలేదని అన్నారు, ఈ వైరస్ ప్రచారం చేస్తున్నట్టు దీని ప్రభావం ఉంటే ఐసీఎంఆర్‌, డబ్ల్యూహెచ్‌ వో గుర్తించకుండా ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు