Begin typing your search above and press return to search.
వైరస్ వ్యాప్తి ఉపాధిపై భారీ దెబ్బ: 66 శాతం మందిపై తీవ్ర ప్రభావం
By: Tupaki Desk | 28 July 2020 1:00 PM ISTమహమ్మారి వైరస్ వ్యాప్తితో విధించిన లాక్‌డౌన్ వలన ఉపాధి.. ఉద్యోగ రంగాలపై తీవ్ర పడింది. పేద.. మధ్య తరగతి ప్రజలపై దుష్ప్రభావం పడింది. పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోవడం.. ఉపాధి మార్గాలపై ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో ఉద్యోగాలు కోల్పోయి.. ఉపాధిలో తీవ్ర నష్టం ఏర్పడి ప్రస్తుతం ప్రజలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వైరస్ వ్యాప్తి వలన తెలుగు రాష్ట్రాల్లో తీరని నష్టం వాటిల్లింది. దీనివలన దేశంలో 66 శాతం మంది జీవనోపాధి కోల్పోయారని తేలింది. అంతలా ఆ మహమ్మారి పేదల పొట్ట కొట్టింది. ఈ విషయాన్ని అజిమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వేలో తేలింది.
ఆ విశ్వవిద్యాలయం చేసిన సర్వే ప్రకారం.. దేశంలో 66 శాతం మంది ప్రజలు జీవనోపాధి కోల్పోయారని తెలిపింది. ఇక తెలంగాణలో ఆ వైరస్ వ్యాప్తి ప్రభావంతో 58 శాతం కుటుంబాల్లో ఆహార వినియోగం తగ్గిందని.. ఆంధ్రప్రదేశ్‌లో 65 శాతం తగ్గిందని ఆ విశ్వవిద్యాలయం తన నివేదికలో పేర్కొంది. ఈ విధంగా ప్రజల ఆదాయం తగ్గడం.. పరిస్థితులు కుదురుకోకపోవడంతో పేదల కోసం ఆ విశ్వవిద్యాలయం కొన్ని సూచనలు చేసింది. పేద కుటుంబాలకు రూ.7 వేల చొప్పున నగదు బదిలీ చేయాలని.. ఆరు నెలల పాటు ఉచితంగా చౌకధర సరుకులు అందించాలని సూచించింది. ప్రభుత్వాలు ఈ చర్యలు తీసుకుంటే కొంతలో కొంత పేదలకు బతుకుపై భరోసా ఉంటుందని అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం తెలిపింది.