Begin typing your search above and press return to search.
ఆక్సిజన్ కోసం యుద్ధ విమానాలు వినియోగిస్తున్న ఆ రాష్ట్ర సర్కార్ !
By: Tupaki Desk | 23 April 2021 12:30 PM GMTఆక్సిజన్ తరలింపు కోసం విమానాలను వాడుతున్న తొలి రాష్ట్రంగా దేశంలో తెలంగాణ ఓ గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఒడిశాకు ఆక్సిజన్ ట్యాంకర్లతో విమానాలు బయలుదేరాయి. 3 రోజుల సమయం ఆదాతో పాటు ఆక్సిజన్ అత్యవసమైన రోగులకు ప్రాణవాయువు అందనుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెలకు, అధికారులకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మూడు, నాలుగు రోజులుగా రాష్ట్రంలో 260 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను వినియోగిస్తున్నారు. అయినా సరిపోవడంలేదు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఙప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను కేటాయించింది.
అయితే కేంద్రం కేటాయిస్తామని చెప్పిన దాంట్లో 70 టన్నుల వరకు తెలంగాణలో ఇప్పటికే అందుబాటులో ఉన్న చిన్న ఆక్సిజన్ ప్లాంట్ల నుంచి లభిస్తోంది. మిగిలిన ఆక్సిజన్‌ను బళ్లారి, భిలాయ్, అంగుల్, పెరంబుదూర్ నుంచి తీసుకోవాలని సూచించింది. తెలంగాణకు అత్యంత సమీపంలోని బళ్లారి స్టీల్ ప్లాంట్ నుంచి తెలంగాణకు కేటాయించింది 20 మెట్రిక్ టన్నులే. వైజాగ్ నుంచి దాదాపు ఇంతే కేటాయించారు. భిలాయ్, పెరంబుదూర్, అంగుల్ నుంచి ఆక్సిజన్ తెచ్చుకోవడం తేలికేమీ కాదు. అవన్నీ దూరంగా ఉన్న ప్లాంట్లు. ఆయా ప్రాంతాలనుంచి ఆక్సిజన్ రావడానికి కనీసం మూడు రోజులు పడుతుండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమాన సేవలను తెలంగాణ రాష్ట్రం వినియోగించుకుంటోంది.
భువనేశ్వర్ నుంచి విమానాల ద్వారా 14.5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి రానుందని వెల్లడించారు.. దీనికోసం 8 ఖాళీ ట్యాంకులను హైదరాబాద్ నుంచి విమానాల్లో తీసుకెళ్తున్నారన్న మంత్రి.. సత్వరమే ఆక్సిజన్ తీసుకొచ్చేందుకు వీలుగా దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసిందని చెప్పారు. వింగ్ కమాండర్ చైతన్య నిజ్హవాన్ ల ఆధ్వర్యంలో ఇండియన్ ఎయిర్ పోర్టుకు చెందిన రెండు C-17 ఎయిర్ క్రాప్ట్ లు వినియోగించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామాత్యులు ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఇతర అధికారులు బేగంపేట విమానాశ్రయం లో ప్రత్యక్షంగా పాల్గొని విమానాల ద్వారా ట్యాంకర్లను పంపే పక్రియను పర్యవేక్షించారు. రోడ్లు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, సర్పరాజ్ అహ్మద్, డా. ప్రీతిమీనా అహర్నిశలు పనిచేసి ఈ ప్రక్రియ విజయవంతంగా జరిగేలా కృషి చేశారు.