Begin typing your search above and press return to search.
మహారాష్ట్ర తరహా వీకెండ్ లాక్ డౌన్ అమలుచేయబోతున్న ఆ రాష్ట్రం
By: Tupaki Desk | 8 April 2021 12:30 PM GMTదేశంలోని అన్ని రాష్ట్రాల్లో కొంచెం కొంచెం గా కరోనా మహమ్మారి కేసులు పెరిగిపోతున్నాయి. గత మూడు రోజుల్లో వరుసగా లక్షకి పైగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే .. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం వారాంతపు లాక్ డౌన్ ను అమల్లోకి తీసుకురాగా .. తాజాగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా మహారాష్ట్ర అమల్లోకి తీసుకువచ్చిన వీకెండ్స్ లాక్ డౌన్ ను అమలు చేయబోతుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లోనూ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. నగరాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పెద్ద నగరాల్లో కంటైన్మెంట్ జోన్లను పెంచుతున్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 4 వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.18 లక్షలు దాటింది. రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో అత్యధిక కేసులు భోపాల్, ఇండోర్, జబల్పూర్, గ్వాలియర్ నగరాల్లోనే ఉన్నాయి. దేశంలో గత కొద్ది రోజులుగా లక్షకుపైగా కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కర్ఫ్యూ, వారాంతపు లాక్ డౌన్ అమలు చేస్తుండగా, గుజరాత్, ఢిల్లీల్లో కర్ఫ్యూ విధించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సీఎం చౌహాన్ అధికారులను ఆదేశించారు. మాస్కులు, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.