Begin typing your search above and press return to search.
ఇక అలాంటి వివాహాలు అమెరికాలో జరగవు
By: Tupaki Desk | 23 Jun 2017 4:41 PM GMTఅమెరికాలో జరుగుతున్న వివాహాల తీరుపై సంచలన నిర్ణయం వెలువడింది. సహజంగా తల్లిదండ్రులు అంగీకారం ఉంటే చిన్న వయస్సులోనే వివాహం చేసుకునేందుకు అమెరికాలో అనుమతిస్తున్నారు. 14 ఏళ్లు వస్తే చాలు వివాహానికి ఓకే చెప్పేయాలని నిబంధనలు కూడా ఉన్నాయి. ఈ నిబందనల కారణంగా 2000 నుంచి 2010 వరకూ 1,70,000 మంది పిల్లలు పెళ్లిళ్లు చేసుకున్నారు. వీరిలో ఒక్క న్యూయార్క్‌లోనే వివాహాలు చేసుకున్న పిల్లలు 3,800 మంది ఉన్నారు. బాల్య వివాహాల నిరోధక గ్రూపు ‘అన్ చైన్డ్ ఎట్ లాస్ట్’ ఈ తాజా డాటా వెల్లడించింది.
అయితే ఇలా పెద్ద ఎత్తున బాల్య వివాహాలు జరుగుతున్న తీరుపై కలతచెందిన న్యూయార్క్ రాష్ట్రం తాజాగా చారిత్రక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బాల్య వివాహాలను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. న్యూయార్క్ స్టేట్ తాజా చట్టం ప్రకారం చట్టబద్ధ వివాహ వయస్సును 14 ఏళ్ల నుంచి 17 ఏళ్లకు మార్చారు కిశోరావస్థలో ఉన్న వారు పెళ్లి చేసుకోవాలనుకంటే తల్లిదండ్రులు, కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో ఈ చట్టాన్ని ఆమోదించారు. ఇదో ప్రగతిశీలక నిర్ణయమని, బాలల పరిరక్షణ, బలవంతపు వివాహాలను నిరోధించేందుకు ఈ చట్టాన్నీ తీసుకువచ్చామని క్యూమో తెలిపారు. ఇందువల్ల మైనర్లు తమ హక్కులను పరిరక్షించుకోవచ్చని, మహిళలు తమ జీవితాలపై సాధికారత కలిగి ఉంటారని చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/