Begin typing your search above and press return to search.
కొత్త స్ట్రెయిన్ ప్రాణాంతకం.. ఆస్పత్రులు కూడా సరిపోవు..!
By: Tupaki Desk | 25 Dec 2020 12:30 PM GMTకరోనా మహమ్మారి సృష్టించిన ఉత్పాతం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ కూడా ప్రారంభించారు. అమెరికా, బ్రిటన్ మరికొన్ని దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్ మొదలుపెట్టారు. తొలిదశలో ఆరోగ్యకార్యకర్తలకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. వ్యాక్సిన్ రావడంతో ప్రపంచదేశాల్లో కరోనాపై భయం పోయింది. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలువలేదు. ఇంతలోనే బ్రిటన్‌లో కొత్త స్ట్రెయిన్ ముంచుకొచ్చింది.
అయితే ఇప్పటికే బ్రిటన్‌లో లాక్డౌన్ విధించగా పలుదేశాలు.. బ్రిటన్‌కు విమానాలను రద్దు చేశాయి. అయితే బ్రిటన్‌లో విజృంభిస్తున్న స్ట్రెయిన్ ఎంతో డేంజర్ అని కొందరు శాస్త్రవేత్తలు అంటుంటే.. మరికొందరేమే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ కొత్త స్ట్రెయిన్ మీద పనిచేస్తుందా? లేదా? అన్న విషయం కూడా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో బ్రిటన్ శాస్త్రవేత్తలు చేసిన ఓ పరిశోధన భయాందోళన కలిగిస్తున్నది.
లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ సైంటిస్టులు కొత్త స్ట్రెయిన్‌పై పరిశోధన చేపట్టారు. వారు చెప్పిన ప్రకారం.. కొత్త వైరస్ ఎంతో డేంజర్. ప్రాణాంతకం. అంతేకాక పాత వైరస్ కంటే కొత్త వైరస్ రెట్టింపు వేగంగా విస్తరిస్తుంది. కరోనా వైరస్ జన్యుమార్పిడి చెంది కొత్త స్ట్రెయిన్‌గా రూపాంతరం చెందింది కాబట్టి ఇది ఎంతో డేంజర్ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కొత్త వైరస్ వల్ల మరణించేవారి సంఖ్య ఎక్కువ ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాక కొత్త స్ట్రెయిన్ విజృంభిస్తే ఆస్పత్రులు కూడా సరిపోవని వారు హెచ్చరిస్తున్నారు. కొత్త వైరస్‌తో ఇప్పటికే ప్రపంచదేశాలు అలర్టయ్యాయి. భారత్ కూడా బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను రద్దుచేసింది. మరోవైపు ఇటీవల బ్రిటన్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి 120 మంది వచ్చారు. వారిలో ఏడుగురికి కరోనా సోకింది. అయితే ఇది పాత కరోనానా.. లేక కొత్త స్ట్రెయినా అన్న విషయంపై క్లారిటీ లేదు.