Begin typing your search above and press return to search.

ఉపాధ్యాయురాలి పట్ల విద్యార్థి వికృత చేష్టలు పరాకాష్ట..!

By:  Tupaki Desk   |   7 Jan 2023 9:30 AM GMT
ఉపాధ్యాయురాలి పట్ల విద్యార్థి వికృత చేష్టలు పరాకాష్ట..!
X
సమాజంలో గురుశిష్యుల బంధానికి ఎంతో విలువ ఉంది. శిష్యుడికి విద్యాబుద్ధులు నేర్పించి గురువు వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దుతారు. అలాంటి గురువుల పట్ల కొందరు విద్యార్థులు వికృతంగా వ్యవహరిస్తుండటం శోచనీయంగా మారుతోంది. సభ్య సమాజం తలదించుకునేలా ఓ విద్యార్థి తనకు పాఠాలు బోధించే ఓ ఉపాధ్యాయురాలి పట్ల వికృతంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తరగతిలో ఉపాధ్యాయురాలు పాఠాలు చెబుతుండగా వెనుక వైపు నుంచి ఆమె వీడియో తీశాడు. దానికి అశ్లీల పాట జోడించి ఇన్ స్ట్రామ్ లో పోస్టు చేశాడు. ఈ వీడియోను చూసిన పలువురు హెచ్ఎం దృష్టికి తీసుకెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెనుగంచిప్రోలు మండలంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ప్రవర్తన గాడి తప్పింది. ఈ పాఠశాల విద్యార్థులు గతంలోనే అనేక సార్లు వికృత చేష్టలతో ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేసిన ఘటనలున్నాయి.

అయితే తాజాగా ఓ తొమ్మిది తరగతి విద్యార్థి పాఠశాల తరగతిలో ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తుండగా వెనుక వైపు నుంచి సెల్ ఫోన్లో రికార్డు చేశాడు.

ఈ వీడియోకు ఒక అశ్లీల పాటను జోడించి ఇన్ స్ట్రాలో పోస్టు చేశాడు. ఈ వీడియోను చాలామంది చూడటంతో విషయం మొత్తం ఊరంతా పాకిపోయింది. ఈ సంఘటనపై హెచ్ఎం గురువారం స్పందించి సదరు విద్యార్థి తండ్రికి బడికి పిలిపించారు. మా పాఠశాలలో మీ కొడుకు వద్దు.. టీసీ తీసుకొని వెళ్లిపోండి అంటూ హెచ్చరించినట్లు తెలుస్తోంది.

అయితే విద్యార్థి తండ్రి మాత్రం ఈ ఒక్కసారిగా వదిలేయండి అంటూ ప్రాధేయపడ్డాడు. కాగా ఈ సంఘటనతో పాఠశాల ఉపాధ్యాయునులు మాత్రం భయాందోళన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలకు మొదట్లోనే చెక్ పెట్టాలని లేదంటే ఒకరిని చూసి మరొకరు ఇలాంటివి చేసే అవకాశం ఉంటుందని హెచ్ఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.