Begin typing your search above and press return to search.
డేంజర్ బెల్: ఏపీలో కరోనా.. కొత్త కోణం!
By: Tupaki Desk | 27 Jun 2020 5:00 PM GMTప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడుల్లో విపరీతంగా ప్రబలుతోంది. అన్ని రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత ఓకేలా ఉండడం లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో అయితే కరోనా కొన్ని రాష్ట్రాల్లో అస్సలు లేదు.
తాజాగా ఏపీలోనూ కరోనా వైరస్ లో కొత్త కోణం బయటపడింది. కరోనా వ్యాధి లక్షణాలు గుర్తించిన కొన్ని గంటల్లోనే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అప్పటివరకు ఆరోగ్యంగా ఉంటూ లక్షణాలు బయటపడిన కొద్ది గంటల్లోనే ఏపీలో మృత్యువాత పడుతుండడం గుబులు రేపుతోంది. కరోనాలోని ఈ కొత్త కోణం ఏపీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
వీరిని పరీక్షించి చూడగా.. వేరే అనారోగ్య సమస్యలు ఉండడం లేదు.కేవలం కరోనాతోనే ఇలా సడన్ గా చావులు వెలుగుచూస్తున్నాయి. ఈ పరిణామం వైద్యవర్గాలను కూడా షాక్ కు గురిచేస్తోంది.
విజయవాడలోని ఏఆర్డీ సెంటర్ లో పనిచేస్తున్న ఆసుపత్రి వైద్యుడు ఇటీవల అకస్మాత్తుగా శ్వాస ఆడడం లేదని వైద్యం అందించే లోపే ప్రాణాలు కోల్పోయాడు. ఇక తూర్పుగోదావరి జిల్లా పెదపూడిలోనూ ఇలాంటి మరణమే సంభవించింది. లక్షణాలు బయటపడ్డ అరగంటలోనే మరణించాడు.
ఇలా లక్షణాలు బయటపడ్డ కొన్ని గంటల్లోనే ఒక రోజులోనే ఏపీలో ప్రాణాలు పోతున్న ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. కరోనా లక్షణాలు లేని రోగులు అప్రమత్తంగా ఉండాలని పరీక్షలు చేసుకొని ప్రాణాలు కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పుడు ఏపీని ఈ లక్షణాలు లేని ఆకస్మిక మరణాలు వణికిస్తున్నాయి. బయటపడేలోపే లోపల అవయవాలు దెబ్బతిని చనిపోతున్నారని వైద్యులు భావిస్తున్నారు.