Begin typing your search above and press return to search.
18 ఏళ్ళ శిక్షకు రెండేళ్ల కుదిరించిన సుప్రీం.. లక్కంటే వాడిదే..!
By: Tupaki Desk | 17 Dec 2022 1:30 AM GMTవిద్యుత్ చౌర్యం కేసులో ఓ వ్యక్తి హైకోర్టు ఏకంగా 18 ఏళ్ళ శిక్ష విధించింది. ఈ కేసును సవాలు చేస్తూ ఆ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించగా అతడికి 16ఏళ్ళ జైలు శిక్షను తగ్గించింది. విద్యుత్ చౌర్యం కేసేమీ హత్యా నేరంతో సమానమైనదిగా చూడలేమని హైకోర్టుకు మొట్టికాయలు వేస్తూ సదరు వ్యక్తికి గరిష్టంగా రెండేళ్ల శిక్షతో సరిపెట్టింది.బాధితుడు ఇప్పటికే జైలులో రెండేళ్ల శిక్ష అనుభవించాడు.
తాజాగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో ఆ వ్యక్తి బయటికి వచ్చేందుకు అవకాశం దొరికింది. దీంతో లక్కంటే అతడిదేననే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ చెందిన ఇఖ్రామ్ అనే వ్యక్తిపై 2019లో విద్యుత్ చౌర్యం కింద ఆ శాఖ అధికారులు తొమ్మిది కేసులు నమోదు చేశారు.దీనిపై 2020లో ట్రయల్ కోర్టు విచారించి ఇఖ్రామ్ ను దోషిగా నిర్ధారించింది.
అయితే ఒక్కో కేసులో గరిష్టంగా రెండేళ్ల చొప్పున మొత్తం 9 కేసులకు గాను 18 ఏళ్ళ జైలు శిక్షను కోర్టు విధించింది. జైలు శిక్షను ఒకేసారి కాకుండా వరుసగా అనుభవించాలని తీర్పును వెలువరించింది. అయితే కోర్టు విధించిన జైలు శిక్ష ఒకేసారి అనుభవించేలా తీర్పు ఇవ్వాలని ఇఖ్రామ్ సుప్రీంను ఆశ్రయించాడు.దీనిపై శుక్రవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారించింది.
ఇలాంటి కేసులను వినేందుకు తాము ఉన్నామని.. కేసు.. చిన్నదా.. పెద్దదా.. అనేది తమకు ముఖ్యం కాదని.. పిటిషనర్లకు న్యాయం చేసేందుకు సుప్రీం కోర్టు పని చేస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కరెంటు చౌరీ కేసును హత్య నేరంతో సమానంగా చూడలేమని.. ఈ కేసులో దోషికి శిక్షను తగ్గించకపోతే అతని హక్కులను తొలగించినట్లేనని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఈ కేసులో దోషికి సరైన న్యాయం జరగలేదని హైకోర్టు గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కేసులో దోషికి ఏకకాలంలో శిక్షను అనుభవించేలా సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. దీంతో అతడికి ఏకంగా 16 ఏళ్ల జైలు శిక్ష తగ్గింది. కాగా ఇప్పటికే ఇఖ్రామ్ రెండేళ్ల జైలు శిక్షను పూర్తి చేసుకోవడంతో అతడు బయటికి వచ్చేందుకు మార్గం దొరికింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.