Begin typing your search above and press return to search.
మాల్యాకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చేసిన సుప్రీం
By: Tupaki Desk | 1 Sep 2020 2:30 AM GMTవేలాది కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని.. వాటికి టోకరా వేసి దేశం దాటేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వ్యవహారాన్ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వేలాది కోట్ల మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించకుండా విదేశాలకు వెళ్లిపోయిన ఆయన.. ఆచూకీని వెంటనే పట్టుకోగలిగినా.. బ్రిటన్ లో తలదాచుకున్న ఆయన్ను దేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు మాత్రం ఏళ్లకు ఏళ్ల సమయం తీసుకున్నా ఇప్పటికి వెనక్కి తీసుకురాలేని పరిస్థితి.
ఇప్పటికే మాల్యాకు సంబంధించిన కేసుల్లో ఆయన్ను దోషిగా తేల్చింది న్యాయస్థానం. ఆ ఉత్తర్వుల్ని సమీక్షించాలని కోరుతూ మాల్యా పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి పిటీషన్ ను విచారణ సందర్భంగా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. మాల్యా తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. ఈ సందర్భంగా ఘాటైన వ్యాఖ్యలు చేసింది.
అక్టోబరు ఐదున మధ్యాహ్నం రెండు గంటలకు తమ ముందుకు విజయ్ మాల్యా హాజరు కావాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏదో అనుకుంటే మరేదో అయినట్లుగా.. తనను దోషిగా తేల్చిన ఉత్తర్వుల్ని సమీక్షించాలని కోరితే.. ఏకంగా తనను ఫలానా తేదీ నాటికి కోర్టు ముందుకు తీసుకొచ్చి నిలబెట్టాలంటూ సుప్రీం అడిగిన తీరు మాల్యాకు ఇబ్బంది కలిగించక మానదు. మరి.. సుప్రీం చెప్పినట్లుగా బుద్దిగా కోర్టుకు వస్తారా? అన్నది అసులు ప్రశ్న. ఆ విషయం తేలాలంటే.. ఆక్టోబరు ఐదు వరకు వెయిట్ చేయాల్సిందే.