Begin typing your search above and press return to search.
చిన్నారులపై జరిగే అకృత్యాలపై సీరియస్ గా స్పందించిన సుప్రీం
By: Tupaki Desk | 9 Feb 2022 4:30 AM GMTగతానికి భిన్నంగా ఇటీవల కాలంలో చిన్నారులపై జరుగుతున్న లైంగికదాడులకు సంబంధించిన ఉదంతాలు ఎక్కువగానే బయటకు వస్తున్నాయి. కన్నుమిన్ను కానరాకుండా చేస్తున్న ఈ దారుణాల విషయంలో కఠినంగా వ్యవహరించటమే కాదు.. నిందితులకు తీవ్ర శిక్షలు విధించే విషయంలో ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదన్న కీలక వ్యాఖ్యల్ని చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఈ అకృత్యాలను తీవ్రంగా పరిగణించటం ద్వారా.. సమాజానికి తగిన సందేశాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ముక్కుపచ్చలారని నాలుగేళ్ల బాలికపై పక్కింటికి చెందిన 70 - 75 ఏళ్ల మధ్యనున్న పెద్ద వయస్కుడు ఒకడు అత్యాచారం చేసిన వైనంపై సుప్రీంకోర్టు ఘాటుగా రియాక్టు అయ్యింది. ఇలాంటి లైంగిక దాడులు.. వేధింపులు సమాజానికి.. మానవత్వానికి మచ్చలాంటివని స్పష్టం చేసింది. ఈ ఉదంతంలో ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించటమే కాదు.. కఠిన శిక్షలు విధించే విషయంలో అస్సలు తగ్గాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
పక్కింట్లో ఉండే ఈ పెద్ద వయస్కుడు చిన్నారిపై ప్రేమను పంచాల్సింది పోయి.. పాపాయి అమాయకత్వంతో ఆడుకోవటాన్ని తీవ్రంగా పరిగణించింది. నిందితుడిపై ఎలాంటి సానుభూతి వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఈ తరహా కేసుల్లో బాధితల పక్షాన న్యాయస్థానాలు నిలిచి.. నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే తగిన శిక్షను విధించడం ద్వారా సమాజానికి సరైన సందేశాన్ని ఇవ్వొచ్చు. వీరిపై ఉదాసీనత చూపాల్సిన అవసరం లేదు. తీవ్రమైన లైంగిక వాంఛలకు ఈ తరహా కేసులు ఒక ఉదహరణ. దేశానికి విలువైన మానవ వనరులు చిన్నారులే. వారే మన దేశ భవిష్యత్తు’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ఈ కేసులో నిందితుడైన 70-75 ఏళ్ల పెద్ద వయస్కుడు టీబీతో బాధ పడుతున్న విషయాన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంధర్మాసనం.. జీవిత ఖైదును 15 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది.కింది కోర్టుల్లో పేర్కొన్న జరిమానాను తప్పనిసరిగా కట్టాల్సిందేనని.. ఆ విషయంలో మరో మాటకు అవకాశం లేదని స్పష్టం చేసింది.